హిందీలో సరే.. తెలుగు లో ఆర్ఆర్‌ఆర్ ఎప్పుడు?

Sat Aug 06 2022 06:00:01 GMT+0530 (IST)

RRR movie in television

టాలీవుడ్ జక్కన్న రాజమౌళి ఆవిష్కరించిన మరో అద్భుతం ఆర్‌ఆర్‌ఆర్. విజువల్ వండర్ గా నిలిచిన ఈ సినిమా వెయ్యి కోట్లకు పైగా వసూళ్లు సాధించి ఈ ఏడాది మేటి సినిమా గా నిలవడమే మాత్రమే కాకుండా ఇండియన్ సినీ చరిత్రలో నిలిచి పోయే సినిమా గా సక్సెస్ ను దక్కించుకుంది. దేశం మొత్తం ఆర్ ఆర్ ఆర్ సందడి దాదాపుగా రెండు మూడు నెలల పాటు కొనసాగింది అనడంలో సందేహం లేదు.థియేట్రికల్ రిలీజ్ తర్వాత ఓటీటీ స్ట్రీమింగ్ తో ఆర్ ఆర్ ఆర్ హడావుడి కంటిన్యూ అయ్యింది. ఇప్పటికి కూడా పలు దేశాల్లో ఆర్ ఆర్ ఆర్ సినిమా ను నెట్ ఫ్లిక్స్ ద్వారా చూస్తూ ఉన్నారు. ఇప్పుడు అందరి దృష్టి సినిమా ఎప్పుడు శాటిలైట్ ద్వారా టీవీల్లో వస్తుంది అని. త్వరలోనే ఆ కోరిక నెరవేరబోతోంది.

హిందీలో ఆర్ ఆర్ ఆర్ సినిమాను స్వాతంత్య్ర దినోత్సవం సందర్బంగా ఆగస్టు 14వ తారీకున టెలికాస్ట్ చేయబోతున్నట్లుగా జీ సినిమాస్ అధికారికంగా ప్రకటించింది. హిందీలో టెలికాస్ట్ అవ్వబోతున్న ఈ సినిమాను తెలుగు లో ఎప్పుడెప్పుడు చేస్తారు అంటూ ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

తెలుగు తో పాటు ఇతర సౌత్ భాషల్లో స్టార్ ఛానల్స్ టెలికాస్ట్ చేయబోతున్నాయి. తెలుగు లో స్టార్ మా లో ఈ సినిమాను త్వరలో వరల్డ్ ప్రీమియర్ చేయబోతున్నట్లుగా అధికారికంగా ప్రకటించారు. కాని ఆ త్వరలో అంటే ఎప్పుడు అనే విషయంలో క్లారిటీ ఇవ్వలేదు. ఆర్ ఆర్ ఆర్ సినిమా ఇప్పటికే కలెక్షన్స్ విషయంలో రికార్డులు నమోదు చేసింది.

ఓటీటీ లో స్ట్రీమింగ్ అయ్యి అక్కడ కూడా భారీ గా స్పందన దక్కించుకుని రికార్డు ను సృష్టించింది. ఇప్పుడు టీవీల ద్వారా వచ్చి కూడా భారీ టీఆర్‌పీ రేటింగ్ ను దక్కించుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి.

కనుక తెలుగు లో ఈ సినిమా ఎప్పుడెప్పుడు టెలికాస్ట్ అవుతుందా అంటూ అంతా ఆసక్తిగా ఉన్నారు. అదే స్వాతంత్య్ర దినోత్సవం సందర్బంగా తెలుగు లో కూడా టెలికాస్ట్ చేస్తే బాగుంటుందని అంతా కోరుకుంటున్నారు. స్టార్ మా ఏం చేయబోతుందో చూడాలి.