Begin typing your search above and press return to search.

'ఆర్.ఆర్.ఆర్' కే అమ్మడి మొదటి ప్రాధాన్యత..!

By:  Tupaki Desk   |   15 Jun 2021 5:30 PM GMT
ఆర్.ఆర్.ఆర్ కే అమ్మడి మొదటి ప్రాధాన్యత..!
X
యావత్ సినీ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తోన్న చిత్రం ''ఆర్‌.ఆర్‌.ఆర్''. దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో ఎన్టీఆర్ - రామ్ చరణ్ కలిసి నటిస్తున్నారు. బాలీవుడ్ స్టార్స్ అజయ్ దేవగన్ - ఆలియా భట్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఇప్పటికే మెజారిటీ భాగం షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రాన్ని కోవిడ్ సెకండ్ వేవ్ నేపథ్యంలో నిలిపివేశారు. అయితే ఇప్పుడిప్పుడే కేసులు తగ్గుముఖం పట్టి పరిస్థితులు సానుకూలంగా ఉండటంతో.. రాజమౌళి తిరిగి సెట్స్ మీదకు వెళ్లాలని ప్లాన్ చేస్తున్నారని తెలుస్తోంది. తదుపరి షెడ్యూల్ జూలై మొదటి వారంలో ప్రారంభమవుతుందని సమాచారం.

'ఆర్.ఆర్.ఆర్' సినిమాలో రెండు పాటలు కొంత టాకీ పార్ట్ మాత్రమే పెండింగ్ ఉన్నాయని తెలుస్తోంది. అందులో చరణ్ - అలియా లపై షూట్ చేయాల్సిన రొమాంటిక్ సాంగ్ ఒకటైతే.. మరొకటి ఎన్టీఆర్ - చెర్రీ లపై చిత్రీకరించాల్సిన పాట. ఇప్పుడు హీరోలిద్దరూ తిరిగి సెట్స్ లో అడుగుపెట్టడానికి రెడీగా ఉన్నారు. అలానే సీత పాత్రలో నటిస్తున్న ఆలియా కూడా 'ఆర్.ఆర్.ఆర్' చిత్రాన్ని ముందుగా కంప్లీట్ చేయాలని నిర్ణయించుకుందట. 'గంగుబాయి' 'బ్రహ్మాస్త్ర' సినిమాల షూటింగ్స్ ని పక్కన పెట్టి టాలీవుడ్ డెబ్యూ చిత్రానికే ముందుగా డేట్స్ ఇవ్వనుందట.

ఇప్పటికే రామ్ చరణ్ - అలియా భట్ లపై షూట్ చేయాల్సిన సాంగ్ కోసం సెట్ కూడా సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది. అలియా బిజీ షెడ్యూల్‌ ను పరిగణనలోకి తీసుకొని జక్కన్న కూడా వీలైనంత త్వరగా ఈ పాటను పూర్తి చేయాలని నిర్ణయించుకున్నారట. దీని తర్వాత తారక్ - చరణ్ లపై పాటను చిత్రీకరిస్తారు. షూటింగ్ రీ స్టార్ట్ అయిన తరువాత పరిస్థితులను బట్టి 'ఆర్.ఆర్.ఆర్' విడుదల తేదీని ప్రకటించే అవకాశం ఉంది. ప్రపంచ వ్యాప్తంగా పది భాషలలో రిలీజ్ అయ్యే సినిమా కావడంతో అన్ని లెక్కలు వేసుకునే రాజమౌళి రిలీజ్ డేట్ ని ఖరారు చేయనున్నారు.