అమెరికాలో వెయ్యి పైగా మల్టీప్లెక్స్ ల్లో #RRR

Sun Dec 05 2021 22:00:01 GMT+0530 (IST)

RRR in over a thousand multiplexes in America

మోస్ట్ అవైటెడ్ పాన్ ఇండియా చిత్రం `ఆర్.ఆర్.ఆర్` భారీ ఎత్తున రిలీజ్ అవుతున్న సంగతి తెలిసిందే. `బాహుబలి` రేంజ్ వసూళ్ల టార్గెట్ గా  ఆర్.ఆర్.ఆర్ మార్కెట్ లోకి దూసుకొస్తోంది. దీంతో పెద్ద ఎత్తున రిలీజ్ ప్లాన్ చేసింది టీమ్. ఇండియాలో రిలీజ్ సంగతి పక్కనబెడితే అమెరికాలో మాత్రం  ఏకంగా 1000 ప్లస్ మల్టీప్లెక్స్ ల్లో `ఆర్.ఆర్.ఆర్` రిలీజ్ అవుతోంది. సారేగామ సినిమాస్..రాప్తార్ క్రియేషన్స్ అమెరికాలో ఈ రేంజ్ లో ప్లాన్ చేసారు. ఈ రెండు సంస్థలు ఓవర్సీస్ లో పంపిణీ చేస్తోన్న నేపథ్యంలో రిలీజ్ ని అంతే భారీగా ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది. ఈ రెండు సంస్థలు థియేటర్ యాజమాన్యాలకు కొన్ని రకాల ఫెసిలిటీస్ సైతం కల్పించారు.ఈ నేపథ్యంలోనే రిలీజ్ ఈ స్థాయిలో జరుగుతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటివరకూ ఏ ఇండియన్ సినిమా ఇన్ని థియటర్లలలో రిలీజ్ చేయలేదు. ఆ రకంగా `ఆర్ ఆర్ ఆర్` ముందుగానే ఈ రకమైన రికార్డుని సొంతం చేసుకుంది. పెన్ స్టూడియోస్ అధినేత జయంతిలాల్ గూడ ఉత్తరాది మొత్తం రిలీజ్ చేస్తున్నారు. అన్ని భాషల్లో  డిజిటల్ రైట్స్ ని సైతం ఇదే సంస్థ దక్కించుకుంది. ఈ నెల 9న ట్రైలర్ లాంచ్ కార్యక్రమాన్ని భారీ ఎత్తున చేస్తున్న సంగతి తెలిసిందే. మెట్రోపాలిటసన్ సిటీస్ టార్గెట్ గా ట్రైలర్ రిలీజ్ చేస్తున్నారు. ప్రచార కార్యక్రమాల్లో ఆర్ ఆర్ ఆర్ టీమ్ అంతా భాగం కానుందని సమాచారం.

రామ్ చరణ్ ఎన్టీఆర్.. అజయ్ దేవగణ్.. సముద్రఖని ఇలా అందరూ రిలీజ్ వరకూ సహకరించనున్నారు. ఇంకా బాలీవుడ్ నటి అలియాభట్..బ్రిటన్ బ్యూటీ ఒలివియో మోరిస్.. రే స్టీవెన్ సన్.. అలిసన్ డూడీ కీలక పాత్రలు పోషించారు. వాళ్లు కూడా అవసరం మేర ప్రచారంలో పాల్గొంటారని తెలుస్తోంది. ఈ చిత్రాన్ని డి.వి.వి ఎంటర్ టైన్ మెంట్స్ పై  దానయ్య భారీ బడ్జెట్ తో నిర్మించారు. కోవిడ్ వల్ల ఆర్.ఆర్.ఆర్ బడ్జెట్ అదుపుతప్పిందన్న ప్రచారం ఉంది. అయినా బిజినెస్ బావుంది. జనవరి 7న వరల్డ్ వైడ్ గా రిలీజ్ కానుంది.