Begin typing your search above and press return to search.

ఎన్టీఆర్ - చరణ్ లపై సాంగ్ షూట్ తో స్టార్ట్ కాబోతున్న RRR..?

By:  Tupaki Desk   |   19 Jun 2021 2:30 AM GMT
ఎన్టీఆర్ - చరణ్ లపై సాంగ్ షూట్ తో స్టార్ట్ కాబోతున్న RRR..?
X
దర్శకధీరుడు రాజమౌళి 'బాహుబలి' సినిమా తర్వాత కాస్త గ్యాప్ తీసుకొని తెరకెక్కిస్తున్న సినిమా 'ఆర్‌.ఆర్‌.ఆర్‌'. యంగ్ టైగర్ ఎన్టీఆర్ - మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కలిసి నటిస్తున్న ఈ మల్టీ స్టారర్‌ పై భారీ అంచనాలు నెలకొన్నాయి. దీనికి తగ్గట్టే ఈ పాన్ ఇండియా సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ భారీగా జరిగింది. ఇప్పటికే ఈ చిత్రానికి సంబంధించిన మెజారిటీ భాగం షూటింగ్ కంప్లీట్ అవ్వగా.. రెండు పాటలు మాత్రమే పెండింగ్ ఉన్నట్లు తెలుస్తోంది. కరోనా సెకండ్ వేవ్ పరిస్థితుల నేపథ్యంలో ట్రిపుల్ ఆర్ షూట్ వాయిదా పడింది.

అయితే ఇప్పుడు కరోనా కేసులు తగ్గుముఖం పడుతూ, సాధారణ పరిస్థితులు నెలకొంటున్న నేపథ్యంలో టాలీవుడ్ లో సినీ కార్యకలాపాలు తిరిగి ప్రారంభం అవుతున్నాయి. లాక్ డౌన్ సడలింపులతో ఇప్పటికే కొన్ని చిత్రాల షూటింగులు రీ స్టార్ట్ అయ్యాయి. ఈ క్రమంలో 'ఆర్.ఆర్ ఆర్' చిత్రాన్ని కూడా సెట్స్ పైకి తీసుకెళ్లడానికి మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు. జూన్ చివరి వారం నుంచి ఇద్దరు స్టార్ హీరోలు కూడా షూట్ లో పాల్గొనడానికి రెడీ అయ్యారు.

ముందుగా ఎన్టీఆర్ - చరణ్ లపై ఓ ఎపిక్ సాంగ్ చిత్రీకరించడానికి RRR టీమ్ సన్నద్ధం అవుతోందని తెలుస్తోంది. ఇప్పటికే దీని కోసం రామోజీ ఫిలిం సిటీలో సెట్ కూడా సిద్ధం చేసినట్లు సమాచారం. అలానే చరణ్ - అలియా భట్ కాంబినేషన్లో ఓ రొమాంటిక్ సాంగ్ ను కూడా షూట్ చేయనున్నారు. షెడ్యూల్స్ కుదించుకొని తక్కువ రోజుల్లోనే షూటింగులు పూర్తి చేయాలని టాలీవుడ్ పెద్దలు నిర్ణయించిన నేపథ్యంలో 'ఆర్.ఆర్.ఆర్' షూటింగ్ కూడా వీలైనంత త్వరగా కంప్లీట్ చేయాలని రాజమౌళి నిర్ణయించుకున్నారట. దీనిని అనుసరిస్తూ విడుదల తేదీని కూడా ప్రకటించనున్నారని తెలుస్తోంది.