Begin typing your search above and press return to search.

RRR ఫ్యాన్స్ లో ఉత్కంఠ‌..ఏం జ‌ర‌గ‌బోతోంది?

By:  Tupaki Desk   |   24 Jan 2023 4:00 PM GMT
RRR ఫ్యాన్స్ లో ఉత్కంఠ‌..ఏం జ‌ర‌గ‌బోతోంది?
X
ద‌ర్శ‌కుడు ఎస్‌. ఎస్‌. రాజ‌మౌళి అత్యంత ప్ర‌తిష్టాత్మ‌కంగా తెర‌కెక్కించిన పాన్ ఇండియా వండర్ 'RRR' వ‌ర‌ల్డ్ వైడ్ గా రికార్డులు సృష్టించ‌డ‌మే కాకుండా వ‌ర‌ల్డ్ వైడ్ గా బాక్సాఫీస్ వ‌ద్ద భారీ వ‌సూళ్ల‌ని రాబ‌ట్టిన విష‌యం తెలిసిందే. ఇదిలా వుంటే దేశ విదేశాల్లోనూ ఊహకంద‌ని స్థాయిలో వసూళ్ల‌తో పాటు క్రేజ్ ని ప‌లు అంత‌ర్జాతీయ అవార్డుల్ని ద‌క్కించుకుంటూ RRR స‌త్తా చాటుకుంటోంది. ఇప్ప‌టికే ఎన్నో అవార్డుల్ని ద‌క్కించుకుంటూ వ‌రుస‌గా సంచ‌ల‌నాలు సృష్టిస్తోంది.

అంత‌ర్జాతీయంగా ఇండియ‌న్ సినిమా స‌త్తా ఏంటో చూపిస్తూ వ‌రుస అవార్డుల్ని ద‌క్కించ‌కుంటున్న 'RRR' ఆస్కార్ అవార్డులకు ఇటీవ‌ల షార్ట్ లిస్ట్ చేయ‌బ‌డిన విష‌యం తెలిసిందే. రీసెంట్ గా 'నాటు నాటు' సాంగ్ కు గానూ బెస్ట్ ఒరిజిన‌ల్ సాంగ్ విభాగంలో గోల్డెన్ గ్లోబ్ పుర‌స్కారాన్ని ద‌క్కించుకోవ‌డ‌మే కాకుండా క్రిటిక్స్ ఛాయ‌స్‌, న్యూయార్క్ ఫిల్మ్ క్రిటిక్స్ స‌ర్కిల్ అవార్డుల్ని కూడా సొంతం చేసుకుంది. తాజాగా మ‌రో అరుదైన అవార్డుని ద‌క్కించుకోవ‌డం విశేషం.

జ‌పాన్ 46వ అకాడ‌మీ అవార్డ్స్ లో అవుట్ స్టాండిగ్ ఫారిన్ ఫిల్మ్ కేట‌గిరీలో 'RRR' అవార్డుని ద‌క్కించుకుంది. అవ‌తార్ 2, టాప్ గ‌న్ : మావెరిక్ సినిమాల‌ని వెన‌క్కి నెట్టి RRR ఈ పుర‌స్కారాన్ని సొంతం చేసుకోవ‌డం విశేషం.

గ‌త ఏడాది జాప‌న్ లో విడుద‌లైన ఈ పీరియాడిక్ డ్రామా అక్క‌డ కూడా కాసుల వ‌ర్షం కురిపిస్తోంది. ఇదిలా వుంటే మ‌రి కొన్ని గంట‌ల్లో ప్ర‌తిష్టాత‌కంగా భావించే ఆస్కార్ అవార్డుల్లో RRR భ‌విత‌వ్యం తేల‌బోతోంది.

ఇప్ప‌టికే చాలా మంది RRR ఆస్కార్ భ‌విత‌వ్యంపై ప్ర‌డిక్ష‌న్ చెప్ప‌డం మొద‌లు పెట్టారు. మ‌రి కొంత మంది మాత్రం ఆస్కార్‌ బ‌రిలో 'నాటు నాటు' సాంగ్ కు గానూ RRR ఫైన‌ల్ నామినేష‌న్స్ లో చోటు ద‌క్కించుకుంద‌ని కూడా చెబుతున్నారు. అయితే మ‌న కాల‌మానం ప్ర‌కారం రాత్రి 7 గంట‌ల‌కు ఆస్కార్ కు నామినేట్ అయిన సినిమాల ఫైన‌ల్ లిస్ట్ ని ఆప‌స్కార్ క‌మిటీ ప్ర‌క‌టించ‌నుంద‌ట‌. ఈ నేప‌థ్యంలో RRR ఫ్యాన్స్ లో తీవ్ర ఉత్కంఠ నెల‌కొంది.

గోల్డెన్ గ్లోబ్ లో స‌త్తా చాటిన‌ట్టుగానే 'నాటు నాటు' సాంగ్ కు అవార్డు ల‌భిస్తుందా?.. లేక దీనితో పాటు ఎన్టీఆర్‌, రామ్ చ‌ర‌ణ్‌, రాజ‌మౌళిల‌ని కూడా అస్కార్ వ‌రించి స‌ర్ ప్రైజ్ చేస్తుందా? అన్న‌వి అంద‌రిలో ఆస‌క్తిక‌ర చ‌ర్చ‌కు తెర‌తీస్తోంది. ప్రేక్ష‌కుల్లో నెల‌కొన్న ఉథ్కంఠ‌కు తెర‌ప‌డాలంటే రాత్రి 7 గంట‌ల వ‌ర‌కు వేచి చూడాల్సిందే.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.