Begin typing your search above and press return to search.

RRR ట్రైలర్ టీజ్: భీమ్ కోసం రామ్..!

By:  Tupaki Desk   |   8 Dec 2021 6:57 AM GMT
RRR ట్రైలర్ టీజ్: భీమ్ కోసం రామ్..!
X
రేపు గురువారం (డిసెంబర్ 9) RRR ట్రైలర్ డే. సినీ ప్రియులందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్న ఈ బిగ్గెస్ట్ యాక్షన్ డ్రామా ఎలా ఉండబోతోందో ట్రైలర్ శాంపిల్ గా చూపించనుంది. అందుకే అందరూ దీని కోసం ఎగ్జైటింగ్ గా ఉన్నారు. అయితే వారి ఉత్సాహాన్ని ఆతృతను రెట్టింపు చేయడానికి ట్రిపుల్ టీమ్ స్పెషల్ అప్డేట్స్ తో ముందుకు వస్తోంది.

దర్శకధీరుడు ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న 'ఆర్.ఆర్.ఆర్' చిత్రంలో ఎన్టీఆర్ - రామ్ చరణ్ లు హీరోలుగా నటించారు. రేపు ట్రైలర్ విడుదల కానున్న నేపథ్యంలో ఇప్పటికే తారక్ - చరణ్ ల పోస్టర్స్.. అలియా భట్ - అజయ్ దేవగన్ పాత్రల మేకింగ్ వీడియోలను సోషల్ మీడియాలో పంచుకున్నారు.

అలానే ‘బ్రేస్ యువర్ సెల్ఫ్ ఫర్ రామ్’ అంటూ అల్లూరి సీతారామరాజుకు సంబంధించిన ట్రైలర్ టీజ్ ను ఎన్టీఆర్ రిలీజ్ చేశారు. పోలీస్ గెటప్ లో చెర్రీ నిప్పుల్లో నడుచుకుంటూ వస్తున్న ఈ వీడియో ఆకట్టుకుంది. ఈ క్రమంలో తాజాగా ‘బ్రేస్ యువర్ సెల్ఫ్ ఫర్ భీమ్’ అనే క్యాప్షన్ తో కొమురం భీమ్ ట్రైలర్ టీజ్ ను చరణ్ విడుదల చేశారు.

ఎన్టీఆర్ బైక్ స్టార్ట్ చేసి దూసుకుపోవడం ఇందులో చూడొచ్చు. తల వరకు నీటిలో మునిగి, భీమ్ ఎవరినో వేటాడటానికి రెడీగా ఉండటాన్ని సూచిస్తోంది. బ్రేస్ యువర్ సెల్ఫ్ ఫర్ భీమ్ అనే బ్యాగ్రౌండ్ మ్యూజిక్ తో వచ్చిన ఈ వీడియో అభిమానులను విపరీతంగా అలరిస్తోంది. ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్న ఈ రెండు వీడియో క్లిప్స్ RRR ట్రైలర్ మీద అంచనాలు పెంచేశాయి.

కాగా, మహావీరులైన అల్లూరి సీతారామ రాజు - కొమరం భీమ్‌ నిజ జీవిత పాత్రల ఆధారంగా ఫిక్షనల్ పీరియాడికల్ డ్రామాగా 'ఆర్.ఆర్.ఆర్' సినిమా తెరకెక్కుతోంది. దీని కోసం టాలీవుడ్ స్టార్స్ ఎన్టీఆర్ - రామ్ చరణ్ ఫస్ట్ టైం స్క్రీన్ స్పేస్‌ ను పంచుకున్నారు. డీవీవీ దానయ్య భారీ బడ్జెట్ తో నిర్మించిన ఈ చిత్రానికి ఎంఎం కీరవాణి సంగీతం సమకూర్చారు. ప్రపంచ వ్యాప్తంగా పది భాషల్లో 2022 జనవరి 7న RRR మూవీ విడుదల కానుంది.