చెర్రీ రిక్వెస్ట్ తో 'ఆర్.ఆర్.ఆర్' షూట్ మరో నెల పొడిగిస్తున్నారా..?

Tue Feb 23 2021 16:00:01 GMT+0530 (IST)

RRR Movie Shooting Updates

యంగ్ టైగర్ ఎన్టీఆర్ - మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోలుగా దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న భారీ మల్టీస్టారర్ 'ఆర్.ఆర్.ఆర్'. అనేక వాయిదాల తర్వాత చివరకు ఈ చిత్రాన్ని దసరా కానుకగా అక్టోబర్ 13న ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు ప్రకటించారు. రిలీజ్ డేట్ ని దృష్టిలో పెట్టుకుని దానికి తగ్గట్టే వర్క్ చేస్తున్న రాజమౌళి అండ్ టీమ్.. టాకీ పార్ట్ మొత్తం మార్చి ఎండింగ్ కి కంప్లీట్ చేయాలని టార్గెట్ గా పెట్టుకున్నారని తెలుస్తోంది. అయితే ఇప్పుడు చరణ్ రిక్వెస్ట్ మేరకు 'ఆర్.ఆర్.ఆర్' షూట్ మరో నెల పొడిగించారని ఫిలిం సర్కిల్స్ లో టాక్ వినిపిస్తోంది.రామ్ చరణ్ 'ఆర్.ఆర్.ఆర్' తో పాటు 'ఆచార్య' సినిమాలో కూడా నటిస్తున్న విషయం తెలిసిందే. మెగాస్టార్ చిరంజీవి - డైరెక్టర్ కొరటాల శివ కాంబినేషన్ లో రూపొందుతున్న ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం రాజమండ్రి పరిసర ప్రాంతాల్లో జరుగుతోంది. ఇందులో చరణ్ కూడా పాల్గొంటున్నాడు. 'ఆచార్య'ని మే 13న రిలీజ్ చేస్తున్నట్లు అనౌన్స్ చేసిన నేపథ్యంలో తన పాత్రకు సంబంధించిన చిత్రీకరణ వీలైనంత త్వరగా పూర్తి చేయాలని చెర్రీ నిర్ణయించుకున్నారు. అందువల్ల 'ఆర్.ఆర్.ఆర్' షూట్ మరికొన్ని రోజులు ఎక్స్టెండ్ చేయాలని రాజమౌళిని కోరాడట. దీనికి అంగీకరించిన దర్శకుడు ఈ సినిమా షూట్ డెడ్ లైన్ ఏప్రిల్ ఎండింగ్ కి మార్చుకున్నారని తెలుస్తోంది.

'ఆచార్య' లో షూటింగ్ కంప్లీట్ అవ్వగానే 'ఆర్.ఆర్.ఆర్' లో చరణ్ - అలియా భట్ లపై రెండు సాంగ్స్ ఏప్రిల్ నెలలోనే షూట్ చేస్తారని సమాచారం. కాకపోతే ఎన్టీఆర్ కి సంబంధించిన చిత్రీకరణ మాత్రం వచ్చే నెలలోనే పూర్తి చేసే అవకాశాలు ఉన్నాయి. ఒకవైపు షూటింగ్ జరుపుతూనే మరోవైపు పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ మరియు గ్రాఫిక్స్ వర్క్స్ కూడా చేయాలని రాజమౌళి ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. కాగా పాన్ ఇండియా లెవల్ లో రూపొందిస్తున్న ఈ చిత్రాన్ని డీవీవీ దానయ్య భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. అజయ్ దేవగన్ - సముద్రఖని - శ్రేయా వంటి స్టార్స్ ఇందులో నటిస్తున్నారు.