Begin typing your search above and press return to search.

'ఆర్.ఆర్.ఆర్' కోసం జక్కన్న అలాంటి స్ట్రాటజీ ఫాలో అవుతున్నాడా..?

By:  Tupaki Desk   |   26 Nov 2020 4:45 AM GMT
ఆర్.ఆర్.ఆర్ కోసం జక్కన్న అలాంటి స్ట్రాటజీ ఫాలో అవుతున్నాడా..?
X
దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న భారీ మల్టీస్టారర్‌ ''ఆర్.ఆర్.ఆర్''. యంగ్ టైగర్ ఎన్టీఆర్ - మెగా పవర్ స్టార్ రామ్ చరణ్‌ కలిసి నటిస్తున్న ఈ చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇందులో చరణ్ 'మన్నెం దొర అల్లూరి సీతారామరాజు'గా.. తారక్ 'కొమరం భీమ్' పాత్రలో నటిస్తున్నారు. పాన్ ఇండియా ప్రాజెక్ట్ గా రూపొందుతున్న ఈ చిత్రంలో పలువురు ఇతర భాషల నటీనటులు కూడా నటిస్తున్నారు. అజయ్ దేవగన్ - శ్రియా - సముద్రఖని - అలియా భట్‌ - ఒలీవియా మోరిస్‌ వంటి స్టార్స్ ఇందులో ప్రధాన పాత్రల్లో కనిపించనున్నారు. ఇదే క్రమంలో 'ఆర్.ఆర్.ఆర్' కి మరింత బజ్ క్రియేట్ చేయడం కోసం జక్కన్న మరో ప్లాన్ తో ముందుకొస్తున్నాడని తెలుస్తోంది.

తెలుగుతో పాటు తమిళ కన్నడ మలయాళ హిందీ భాషల్లో రూపొందుతున్న 'ఆర్.ఆర్.ఆర్' చిత్రానికి ఆయా భాషల్లో ప్రముఖుల చేత వాయిస్ ఓవర్ చెప్పించాలని రాజమౌళి అనుకుంటున్నారాట. గతంలో 'ఈగ' చిత్రానికి ఇదే పద్ధతి ఫాలో అయ్యాడు జక్కన్న. ఇప్పుడు 'ఆర్.ఆర్.ఆర్' కోసం తెలుగులో మెగాస్టార్ చిరంజీవి.. హిందీలో అమీర్ ఖాన్.. ఇతర భాషల స్టార్స్ తో పాత్రలను, స్టోరీ నేపథ్యాన్ని పరిచయం చేయబోతున్నారట. ఇప్పటికే మెజారిటీ భాగం చిత్రీకరణ పూర్తి చేసుకున్న 'ఆర్.ఆర్.ఆర్' షూటింగ్ కోవిడ్ నేపథ్యంలో తిరిగి ప్రారంభమైంది. ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్ తో ప్రొడ్యూసర్ డీవీవీ దానయ్య నిర్మిస్తున్నారు. కీరవాణి సంగీతం సమకూరుస్తుండగా.. సెంథిల్ కుమార్ సినిమాటోగ్రాఫర్ గా వ్యవహరిస్తున్నారు. ఈ పాన్ ఇండియా ప్రాజెక్ట్ 2021లో ప్రేక్షకుల ముందుకు రానుంది.