Begin typing your search above and press return to search.

జక్కన్న ఫ్యాన్స్‌ హ్యాపీ.. హీరోల ఫ్యాన్స్‌ అన్‌ హ్యాపీ

By:  Tupaki Desk   |   25 March 2020 6:20 PM GMT
జక్కన్న ఫ్యాన్స్‌ హ్యాపీ.. హీరోల ఫ్యాన్స్‌ అన్‌ హ్యాపీ
X
ఎప్పుడెప్పుడా అంటూ ఎదురు చూసిన ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ టైటిల్‌ లో ఇంకా టైటిల్‌ ఫుల్‌ ఫామ్‌ ను జక్కన్న నిన్న ఉగాది సందర్బంగా విడుదల చేయడం జరిగింది. మోషన్‌ పోస్టర్‌ కు మంచి స్పందన వచ్చింది. రౌద్రం రణం రుధిరం టైటిల్‌ లోగో అందరిని ఆకట్టుకుంటుంది. జక్కన్న ఫ్యాన్స్‌ కు ఈ మోషన్‌ పోస్టర్‌ విపరీతంగా నచ్చిందట. అయితే ఎన్టీఆర్‌ ఇంకా రామ్‌ చరణ్‌ ఫ్యాన్స్‌ మాత్రం పెదవి విరుస్తున్నారట.

సోషల్‌ మీడియాలో తమ హీరో ఫస్ట్‌ లుక్‌ పోస్టర్‌ ను ట్రెండ్‌ చేయాలనుకున్న ఫ్యాన్స్‌ కు ఇది నిరాశ కలిగించింది. హీరోల లుక్స్‌ ను ఇంకా రివీల్‌ చేయక పోవడంతో పాటు క్లారిటీగా వారి పాత్రలకు సంబంధించిన విశేషాలను జక్కన్న చూపించలేదు. దాంతో నందమూరి ఇంకా మెగా ఫ్యాన్స్‌ ఒకింత నిరుత్సాహంను వ్యక్తం చేస్తున్నట్లుగా తెలుస్తోంది. ఉగాది రోజున ఏదో ఉండబోతుంది అంటూ తాము అంతా కూడా ఎదురు చూశాం అని కాని జక్కన్న నిరుత్సాహ పర్చాడంటూ ఆయా హీరో ఫ్యాన్స్‌ సోషల్‌ మీడియాలో కామెంట్స్‌ చేస్తున్నారు.

ఆ నిరుత్సాహంతోనే మోషన్‌ పోస్టర్‌ ను ఎక్కువగా ట్రెండ్‌ అయ్యేలా చేయలేదని కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. మొత్తానికి ఆర్‌ఆర్‌ఆర్‌ చిత్రం విషయంలో జక్కన్న ఫ్యాన్స్‌ హ్యాపీగా ఉన్నా హీరోల ఫ్యాన్స్‌ మాత్రం నిరుత్సాహంతో ఉన్నారు. చరణ్‌ బర్త్‌ డేకు అయిన ఫస్ట్‌ లుక్‌ ను విడుదల చేయాలంటూ మెగా ఫ్యాన్స్‌ జక్కన్నను రిక్వెస్ట్‌ చేస్తున్నారు.