Begin typing your search above and press return to search.

'ఆర్.ఆర్.ఆర్' విడుదల తేదీపై క్లారిటీ ఇచ్చిన ప్రొడ్యూసర్

By:  Tupaki Desk   |   4 April 2020 8:50 AM GMT
ఆర్.ఆర్.ఆర్ విడుదల తేదీపై క్లారిటీ ఇచ్చిన ప్రొడ్యూసర్
X
దర్శకధీరుడు రాజమౌళి ప్రతిష్టాత్మకంగా రూపొందిస్తున్న భారీ మల్టీస్టారర్ 'రౌద్రం రణం రుధిరం'.. ఈ చిత్రంలో స్టార్ హీరోలు ఎన్టీఆర్, రామ్ చరణ్ నటిస్తుండటంతో ఈ చిత్రంపై భారీ అంచనాలే ఉన్నాయి. ఈ చిత్రాన్ని డీవీవీ దానయ్య నిర్మిస్తుండగా కీరవాణి సంగీతాన్ని అందిస్తున్నారు. బాలీవుడ్ స్టార్స్ అజయ్ దేవగన్ - అలియా భట్ ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు. వచ్చే ఏడాది సంక్రాతి కానుకగా జనవరి 8న విడుదల కానున్న ఈ చిత్రం వాయిదా పడబోతోంది అంటూ ఈ మధ్య వార్తలు వస్తున్నాయి. వాస్తవానికి ఈ సినిమాను 2020లో జులై 30న విడుదల చేస్తామని గతంలో రాజమౌళి - చిత్ర నిర్మాతలు మీడియా ముఖంగా ప్రకటించారు.

అయితే అనుకున్న సమయానికి షూటింగ్ జరగక పోవడంతో ఈ చిత్రాన్ని వచ్చే ఏడాదికి వాయిదా వేశారు. అయితే కొద్ది రోజుల క్రితం నార్త్ ఇండియాలో మొదలు కావలసిన షెడ్యూల్ ఆగిపోయింది. దీనితో మరో మారు ఆర్.ఆర్. ఆర్ విడుదల వాయిదా పడడం ఖాయం అంటూ ప్రచారం జరిగింది. కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టే పనిలో భాగంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు లాక్ డౌన్ ప్రకటించి కఠిన చర్యలు తీసుకుంటున్నాయి. అలాగే చిత్ర పరిశ్రమ స్వచ్ఛందంగా షూటింగ్స్ కి బంద్ ప్రకటించడం జరిగింది. దీని కారణంగా ఆర్ ఆర్ ఆర్ షూటింగ్ కి సైతం బ్రేక్ పడింది. దీంతో అనుకున్న టైమ్ కి ఆర్.ఆర్.ఆర్ విడుదల కాదంటూ న్యూస్ స్ప్రెడ్ అయింది.

అయితే దీనిపై చిత్ర నిర్మాత డీవీవీ దానయ్య స్పందించారు. ఆర్.ఆర్.ఆర్ మూవీ విడుదలపై వస్తున్న పుకార్లను ఖండించారు. చెప్పిన ప్రకారం ఆర్ ఆర్ ఆర్ వచ్చే ఏడాది జనవరి 8న విడుదల అవుతుందని ఆయన కుండబద్దలు కొట్టారు. ఒక ప్రముఖ ఆంగ్ల దినపత్రికతో అయన మాట్లాడుతూ లాక్ డౌన్ కారణంగా ఆర్ ఆర్ ఆర్ విడుదల వాయిదా పడుతుందనే వార్తలలో నిజం లేదని చెప్పారు. ఇప్పటికే చాలా వరకు గ్రాఫిక్ వర్క్ పూర్తయిందని, మిగిలిన షూటింగ్ పార్ట్ పూర్తి చేసి చెప్పిన సమయానికి చిత్రాన్ని విడుదల చేస్తామని వాయిదా పుకార్లకు ఫుల్ స్టాప్ పెట్టాడు.