వరల్డ్ బిగ్గెస్ట్ స్క్రీన్ పై ఆర్ఆర్ఆర్ సందడి

Fri Sep 30 2022 13:27:03 GMT+0530 (India Standard Time)

RRR Film to Play on World Biggest Screen

టాలీవుడ్ జక్కన్న రాజమౌళి దర్శకత్వంలో రూపొందిన ఆర్ ఆర్ ఆర్ సినిమా విడుదల అయ్యి నెలలు గడుస్తున్నా కూడా సందడి మాత్రం కొనసాగుతూనే ఉంది. వెయ్యి కోట్లకు పైగా వసూళ్లను రాబట్టిన ఆర్ ఆర్ ఆర్ సినిమా అంతకు మించిన ఎన్నో అరుదైన గౌరవాలను దక్కించుకుంటూ ఉంది. జాతీయ అంతర్జాతీయ స్థాయిలో ప్రముఖుల ప్రశంసలు దక్కించుకున్న ఈ సినిమాకు మరో అరుదైన గౌరవం దక్కబోతుంది.అక్టోబర్ 1వ తారీకున ప్రపంచంలోనే అతి పెద్దదైన ఐమాక్స్ స్క్రీన్ పై ఆర్ ఆర్ ఆర్ సినిమాను ప్రదర్శించబోతున్నారు. ప్రేక్షకులతో పాటు రాజమౌళి అక్కడ సినిమాను చూడబోతున్నారు. లాస్ ఏంజిల్స్ లోని అతి పెద్ద టీఎల్సీ సినిమాస్ లో ఈ బిగ్గెస్ట్ టాలీవుడ్ బ్లాక్ బస్టర్ సినిమా స్క్రీనింగ్ అవ్వబోతుంది.

ఇది ఇండియన్ సినిమా కు దక్కుతున్న గౌరవం అంటూ అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు. ప్రపంచ వ్యాప్తంగా ఇప్పటికే నెట్ ఫ్లిక్స్ ద్వారా ఇతర ఓటీటీ ద్వారా సినిమా అందుబాటులో ఉంది. అయినా కూడా బిగ్గెస్ట్ సిల్వర్ స్క్రీన్ పై సినిమాను చూసేందుకు వందల సంఖ్యలో ఇప్పటికే అడ్వాన్స్ బుకింగ్ జరిగిందట.

ఈ షో యొక్క ప్రత్యేకత ఏంటీ అంటే మన తెలుగు భాషలోనే అక్కడ స్క్రీనింగ్ అవ్వబోతుంది. తెలుగు మాటల.. ఇంగ్లీష్ సబ్ టైటిల్స్ తో సినిమాను అక్కడి ప్రేక్షకులకు అందించబోతున్నట్లుగా అధికారికంగా ప్రకటన వచ్చింది.

రాజమౌళితో ఈ బిగ్గెస్ట్ మూవీని బిగ్ స్క్రీన్ పై ఎంజాయ్ చేయండి అంటూ ఆర్ ఆర్ ఆర్ టీమ్ అధికారికంగా ట్విట్టర్ లో పోస్ట్ షేర్ చేయడం జరిగింది.

ఎన్టీఆర్ చరణ్ లు కొమురం భీమ్ అల్లూరిగా నటించిన ఈ సినిమాలో ఆలియా భట్ కీలక పాత్రలో కనిపించిన విషయం తెల్సిందే. కీరవాణి సంగీతం అందించిన ఈ సినిమా మ్యూజికల్ గా సెన్షేషన్ సక్సెస్ ను దక్కించుకుంది.నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.