Begin typing your search above and press return to search.

RRR .. ఈ వీడియో చూస్తే మైండ్ బ్లాంక్ అవ్వాల్సిందే!

By:  Tupaki Desk   |   25 Jun 2022 9:44 AM GMT
RRR .. ఈ వీడియో చూస్తే మైండ్ బ్లాంక్ అవ్వాల్సిందే!
X
వెండితెర‌పై గ్రాఫిక్స్ ని అద్భుతంగా ఆవిష్క‌రించ‌డంతో సీనియ‌ర్ ద‌ర్శ‌కుడు కోడి రామ‌కృష్ణ‌ది ప్ర‌త్యేక శైలి. ఆయ‌న తెర‌కెక్కించిన 'అమ్మోరు', అంజి, అరుంధ‌తి చిత్రాలు ఇందుకు అద్దంప‌ట్టాయి. ఆ త‌రువాత అంత‌కు మించిన స్థాయిలో ఇండియాన్ సినిమాకు త‌న‌దైన మార్కు సొబ‌గుల‌ద్ది వండ‌ర్స్ ని క్రియేట్ చేస్తున్నారు స్టార్ డైరెక్ట‌ర్ ఎస్‌.ఎస్‌. రాజ‌మౌళి. 'ఈగ‌' నుంచి ఆయ‌న అంద‌మైన క‌థ‌ల‌కు గ్రాఫిక్స్‌ని జోడించి అద్భుతాలు చేస్తున్నారు.

'బాహుబ‌లి' సిరీస్ చిత్రాల‌తో ప్ర‌పంచ వ్యాప్తంగా తెలుగు సినిమా ఘ‌న‌త‌ని స‌గ‌ర్వంగా చాటారు. ఈ మూవీ కోసం భారీ సెట్ లు నిర్మించినా.. భారీ స్థాయిలో యుద్ధ విన్యాసాల‌ని ప‌తాక స్థాయిలో ఆవిష్క‌రించినా గ్రాఫిక్స్ అని తెలియ‌కుండా తెర‌కెక్కించి ప్రేక్ష‌కుల‌కు స‌రికొత్త అనుభూతిని క‌లిగించి శ‌భాష్ అనిపించుకున్నారు. ఈ మూవీతో తాను పాన్ ఇండియా స్థాయి ద‌ర్శ‌కుడిగా గుర్తింపుని సొంతం చేసుకోవ‌డ‌మే కాకుండా హీరో ప్ర‌భాస్‌, రానా, అనుష్క‌ల‌ని పాన్ ఇండియా స్టార్లుగా నిల‌బెట్టారు.

'బాహుబ‌లి' ఫ్రాంచైజీ త‌రువాత రాజ‌మౌళి అత్యంత ప్ర‌తిష్టాత్మ‌కంగా తెర‌కెక్కించిన మూవీ 'RRR'. స్టార్ హీరోలు మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్‌, యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ తొలిసారి క‌లిసి న‌టించిన అత్యంత భారీ మ‌ల్టీస్టార‌ర్ మూవీ ఇది. దేశ స్వాంత్య్ర స‌మ‌ర చ‌రిత్ర‌లో లెజెండ్ లుగా నిలిచిన అల్లూరి సీతారామ‌రాజు, కొమురం భీంల ఫిక్ష‌న‌ల్ క‌థ‌గా ఈ మూవీని అత్యంత భారీ స్థాయిలో తెర‌కెక్కించారు. భారీ అంచ‌నాల మ‌ధ్య విడుద‌లైన ఈ మూవీ ప్ర‌పంచ వ్యాప్తంగా రికార్డు స్థాయి వ‌సూళ్ల‌ని రాబ‌ట్టి బాక్సాఫీస్ వ‌ద్ద సంచ‌ల‌నాలు సృష్టించింది.

విడుద‌లైన ద‌గ్గ‌రి నుంచి ఈ మూవీ ఖాతాలో రికార్డు చేరుతూనే వున్నాయి. ఇటీవ‌ల ప్ర‌ముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్‌ నెట్ ఫ్లిక్స్ లో ఈ మూవీ హిందీ వెర్ష‌న్ విడుద‌లైన విష‌యం తెలిసిందే. ఈ నేప‌థ్యంలో హాలీవుడ్ స్టార్స్‌, రైట‌ర్స్‌, డైరెక్ట‌ర్స్ ఈ మూవీపై ప్ర‌శంస‌ల వ‌ర్షం కురిపిస్తూనే సోష‌ల్ మీడియా వేదిక‌గా ప్ర‌చారం చేస్తున్నారు. 'RRR' ఓ అద్భుత‌మని, ఈ మూవీని ప్ర‌తీ ఒక్క‌రు చూడాల‌ని ట్వీట్ లు చేస్తున్నారు. ఇదిలా వుంటే మేక‌ర్స్ తాజాగా ఈ మూవీ క్లైమాక్స్ కు సంబంధించిన వీడియోని విడుద‌ల చేశారు.

ఈ వీడియో వైర‌ల్ అవుతుండ‌గా తాజాగా దీనికి సంబంధించిన మ‌రో వీడియో నెట్టింట వైర‌ల్ గా మారింది. అయితే ఇది ఫ్యాన్ మేడ్ వీడియో కావ‌డం విశేషం. 'RRR' మూవీలో ఇద్ద‌రు హీరోలు పాల్గొన‌గా చిత్రీక‌రించిన క్లైమాక్స్ ఫైట్ కి భారీ అప్లాజ్ వ‌చ్చిన విష‌యం తెలిసిందే. అయితే ఇదే వీడియోకు చాగంటి మాట‌ల‌ని జ‌త చేసి ప‌ర్ ఫెక్ట్ గా ఎడిట్ చేసిన ఓ అభిమాని ఈ వీడియోని సోష‌ల్ మీడియాలో షేర్ చేశాడు.

ఇది ప్ర‌స్తుతం నెట్టింట వైర‌ల్ గా మారి విశేషంగా ఆక‌ట్టుకుంటూ ఫ్యాన్స్ మైండ్ బ్లాక్ చేస్తోంది. చాగంటి కోటేశ్వ‌ర‌రావు చెప్పిన రామ రావ‌ణ యుద్ధం ని 'RRR' క్లైమాక్స్ సీన్ ల‌కు ఆపాదించి ఓ అభిమాని చేసిన వీడియో ఇప్ప‌డు వైర‌ల్ గా మారడం విశేషం.