Begin typing your search above and press return to search.

క‌రోనా హాలీడేస్ ని RRR బ్యూటీ అలా వాడేస్తుందే!

By:  Tupaki Desk   |   3 April 2020 2:30 AM GMT
క‌రోనా హాలీడేస్ ని RRR బ్యూటీ అలా వాడేస్తుందే!
X
లాక్ డౌన్ నేప‌థ్యంలో సెల‌బ్రిటీలంతా ఇళ్ల‌కే ప‌రిమిత‌మ‌య్యారు. నిత్యం షూటింగ్ లతో బిజీగా ఉండే సెల‌బ్రిటీల‌కు ఇది ఓ హాలీడే లా ఉంది. పెళ్లిళ్లు అయిన వాళ్లంతా ఉన్న‌ స‌మ‌యాన్ని ఫ్యామిలీకే కేటాయిస్తున్నారు. భార్య భ‌ర్త‌...అక్క చెల్లి...అన్నా త‌మ్ముడు అంటూ బంధాలు గుర్తు చేసుకుని ఆ ప్రేమాను రాగాల్లో మునిగి తేలుతున్నారు. ఇంకొంద‌రు జిమ్ముల్లో వ‌ర్కౌట్లు...యోగా శాల‌లో యోగాలు చేస్తూ ఫిట్ నెస్ పై దృష్టి పెట్టారు. దాదాపు హీరోయిన్లంతా ఇదే ప‌నిలో బిజీ అయ్యారు. అయితే బాలీవుడ్ హీరోయిన్ ఆలియా భ‌ట్ మాత్రం వీళ్లందిరికీ భిన్నంగా సీరియ‌స్ గా ఆన్ లైన్ లో రైటింగ్ స‌ర్టిఫికేష‌న్ కోర్స్ చేస్తోంది.

ఓ ప్ర‌ఖ్యాత అంత‌ర్జాతీయ సంస్థలో ఈ కోర్సును క‌రోనా సెల‌వులు పూర్త‌య్యేలోపు పూర్తి చేయాల‌ని సీర‌య‌స్ గా చ‌దివేస్తుందిట‌. అదే ప‌నిగా త‌న‌లో క్రియేటివిటీని త‌ట్టి లేపుతుంది. కోర్సు..రైటింగ్ అంటూ య‌మా బీజీగా ఉన్న‌ట్లు బాలీవుడ్ మీడియా వెల్ల‌డించింది. ఇక అలియా మ‌ల్టీ ట్యాలెంటెడ్. ద‌ర్శ‌క‌, నిర్మాత‌ మ‌హేష్ భ‌ట్ త‌న‌యురాలిగా ఎంట్రీ ఇచ్చిన ఆలియా అన‌తి కాలంలోనే స్టార్ హీరోయిన్ గా ఎదిగింది. మంచి డాన్స‌ర్ కూడా. సింగ‌ర్ గాను ప్రావీణ్యం ఉంది. త‌ను న‌టించిన సినిమాల్లో రెండు పాట‌లు తానే స్వ‌యంగా ఆల‌పించి విమ‌ర్శ‌కుల ప్ర‌శంలందుకుంది. తాజాగా స‌ర్టిఫికేష‌న్ కోర్సుతో త‌న‌లో క్రియేట‌ర్ ని కూడా త‌ట్టి లేపుతుంది.

తండ్రి మ‌హేష్ భ‌ట్ లా డైరెక్ట‌ర్ గా కూడా రాణించాల‌ని ఆశ‌ప‌డుతున్న‌ట్లుంది. అయితే అందుకింకా చాలా స‌మ‌యం ఉంది. ప్రస్తుతం బాలీవుడ్ లో అమ్మ‌డి కెరీర్ దేదీప్య‌మానంగా సాగిపోతుంది. ఆర్ ఆర్ ఆర్ సినిమా తో తెలుగులో ఇంట్రీ ఇస్తోంది. పాన్ ఇండియా లెవ‌ల్లో తెర‌కెక్కుతోన్న చిత్రం కావ‌డంతో విజ‌యం సాధిస్తే ఆలియా పేరు దేశం మొత్తం మారు మ్రోగిపోతుంది. ప్ర‌స్తుతం వైర‌స్ కార‌ణంగా ఆర్ ఆర్ ఆర్ షూటింగ్ కి బ్రేక్ ప‌డింది. లాక్ డౌన్ అనంత‌రం అమ్మ‌డు ఆర్ ఆర్ ఆర్ చిత్రీక‌ర‌ణ‌ లో భాగం కానుంది.