Begin typing your search above and press return to search.

RRR ఆలియా షో స్టాప‌ర్

By:  Tupaki Desk   |   5 Dec 2019 1:30 AM GMT
RRR ఆలియా షో స్టాప‌ర్
X
స‌మ‌కాలీన క‌థానాయిక‌ల్లోనే ది బెస్ట్ అని ప్రూవ్ చేసింది ఆలియాభ‌ట్. రాజీ లాంటి నాయికా ప్ర‌ధాన చిత్రంలో న‌టించి విమ‌ర్శ‌కుల ప్ర‌శంస‌ల‌తో పాటు పుర‌స్కారాల్ని ద‌క్కించుకుంది. అందుకే ద‌ర్శ‌క‌ధీరుడు ఎస్.ఎస్.రాజ‌మౌళి ఆర్.ఆర్.ఆర్ కోసం ఏరికోరి ఎంపిక చేసుకున్నారు ఈ యంగ్ బ్యూటీని. మ‌న్యం వీరుడు అల్లూరి సీతా రామ‌రాజు (రామ్ చ‌ర‌ణ్) స‌ర‌స‌న సీత‌గా న‌టిస్తోంది. న‌ర్సీప‌ట్నం స‌మీపంలోని కేడి పేట ప‌రిస‌రాల్లో కొండ కోన‌ల్లో సంచ‌రించి ఆంగ్లేయుల గుండెల్లో గుబులు పుట్టించిన స్వాతంత్య్ర స‌మ‌ర‌యోధుడు అల్లూరి పోరాటం తెలిసిందే. విప్ల‌వం కోసం ప్రాణం పెట్టిన వీరుడికి భార్య‌గా ఆర్.ఆర్.ఆర్ లో ఆలియా క‌నిపించ‌నుంది.

మ‌రోవైపు ఆలియా బాలీవుడ్ లో వ‌రుస‌గా క్రేజీ చిత్రాల్లో న‌టిస్తూ బిజీగా ఉంది. ఇక ఇంత బిజీ షెడ్యూల్స్ లో నూ నిరంత‌రం ఏదో ఒక రెడ్ కార్పెట్ ఈవెంట్ కి హాజ‌రై మెరుపులు మెరిపిస్తూనే ఉంది. తాజాగా ఫిలింఫేర్ గ్లామ‌ర్ అండ్ స్టైల్ అవార్డ్స్ 2019 కార్య‌క్ర‌మంలోనూ ఆలియా త‌ళుక్కుమంది. ఈ వేడుక‌ల్లో బ్లాక్ డిజైన‌ర్ స్లిట్ (పాయ‌లుగా విడిపోయిన‌) డ్రెస్ లో షో స్టాప‌ర్ గా నిలిచింది. వేడుక ఆద్యంతం యూత్ క‌ళ్ల‌న్నీ ఆలియాపైనే. న‌వ్వితే చిల్లులు ప‌డే ఆ బుగ్గ‌ల్లోని నిగ్గులు అంతే ఆక‌ర్ష‌ణీయంగా క‌నిపించాయి ఈ వేడుక‌లో.

ఎంతో ప్ర‌తిష్ఠాత్మ‌కంగా నిర్వ‌హించిన ఈ వేడుక‌ల్లో ఆలియాతో పాటుగా వ‌రుణ్ ధావ‌న్ ఇత‌ర బాలీవుడ్ స్టార్లు సంద‌డి చేశారు. ఆలియా న‌టించిన బ్ర‌హ్మాస్త్ర త్వ‌ర‌లోనే రిలీజ్ కి రానుంది. 2020 జూలై 30న ఆర్.ఆర్.ఆర్ ట్రీట్ ఉంటుంది.