Begin typing your search above and press return to search.

RRR@365 .. అన్నిరోజులు చెర్రీ-తార‌క్ అంతేగా!

By:  Tupaki Desk   |   18 Jun 2020 10:50 AM GMT
RRR@365 .. అన్నిరోజులు చెర్రీ-తార‌క్ అంతేగా!
X
`బాహుబ‌లి` ఫ్రాంఛైజీతో ప్ర‌భాస్ కి ద‌క్కిన‌ క్రేజు RRR స్టార్ల‌కు క‌ష్ట‌మేనా? అంటే అవున‌నే విశ్లేషిస్తున్నారు. బాహుబ‌లి డేస్ తో పోలిస్తే ఆర్.ఆర్.ఆర్ డేస్ కాంప్లికేటెడ్ గా మారాయి. బాహుబ‌లి మానియాతో పోలిస్తే ఆర్.ఆర్.ఆర్ మానియా అంత లేద‌నే తేలిపోయింది. ఉన్న‌ఫ‌లంగా క‌రోనా మ‌హ‌మ్మారీ ఆర్.ఆర్.ఆర్ టీమ్ పై పెద్ద పంచ్ వేసేసింది. దీని ప్ర‌భావంతో.. బాక్సాఫీస్ వ‌ద్ద‌ ఆర్కా మీడియా (బాహుబ‌లి నిర్మాత‌) దున్నుకున్నంత‌గా దాన‌య్య దున్నుకోలేడ‌నే భావిస్తున్నారు. కార‌ణం ఏదైనా బాహుబ‌లి చిత్రంతో ప్ర‌భాస్ కి వ‌చ్చినంత మైలేజ్ రామ్ చ‌ర‌ణ్ - రామారావుకి రావ‌డం క‌ష్ట‌మేన‌ని విశ్లేషిస్తున్నారు.

బాహుబ‌లికి క్రియేట్ అయిన‌ హైప్ ఎందుక‌నో ఆర్.ఆర్.ఆర్ కి క్రియేట‌వ్వ‌లేదు. ఒక‌వేళ క్రియేటైనా క‌రోనాతో అంతా మటుమాయ‌మైంది. ఇదొక్క‌టే టెన్ష‌న్ కాదు.. ఈపాటికే రిలీజ్ మెజారిటీ చిత్రీక‌ర‌ణ పూర్తి చేసుకోవాల్సిన ఈ సినిమా సంక్రాంతికి వాయిదా ప‌డ‌డం.. ఇప్ప‌టికీ రిలీజ్ కి ఏడాది పైగా ప‌డుతుంద‌నే సందేహాలు నెల‌కొన‌డం ఇబ్బందిక‌రంగా మారింది. అంత‌వ‌ర‌కూ చ‌ర‌ణ్‌- తార‌క్ వేచి చూడాల్సిన ప‌రిస్థితి ఉందని విశ్లేషిస్తున్నారు.

అయితే ప్ర‌స్తుత స‌న్నివేశంలో అంత లాంగ్ టైమ్ రామ్ చ‌ర‌ణ్.. య‌న్టీఆర్ వేచి చూస్తారా? వీరికి ప్ర‌భాస్ అంత ఓపిక ఉంటుందా? అంటే క‌ష్ట‌మే. ఇద్ద‌రు ఇప్ప‌టికే ట్రిపుల్ ఆర్ షూటింగ్ కంప్లీట్ అవ్వ‌గానే వేరే ప్రాజెక్ట్స్ చేయ‌డానికి తెగ ప్లాన్ చేస్తున్నారు. ఆల్రెడీ కొన్ని క‌థ‌లు కూడా లైన‌ప్ చేసుకుంటున్నారు. వాటికి సంబంధించి ఇప్ప‌టికే కొన్ని లీకులు కూడా అందాయి.

అలాగే బాహుబ‌లితో పోలిస్తే ఆర్.ఆర్.ఆర్ వ‌ల్ల స్టార్ల‌కు ఒదిగేదేమైనా ఉందా? అంటే అలాంటిదేమీ క‌నిపించ‌డం లేదు. ప్ర‌స్తుత డైల‌మా స‌న్నివేశం వ‌ల్ల ఏదీ క్లారిటీగా లేదు. ఇలాంటి కార‌ణాల వ‌ల్ల‌నా బాహుబ‌లితో ప్ర‌భాస్ కి వ‌చ్చినంత పాన్ ఇండియా క్రేజ్ రామ్ చ‌ర‌ణ్ - రామారావుల‌కు ట్రిపుల్ ఆర్ తో రాక‌పోవ‌చ్చు అని నిపుణులు అభిప్రాయ‌ప‌డుతున్నారు. పైగా ఆర్‌.ఆర్‌.ఆర్ బ్లాక్ బ‌స్ట‌ర్ అయితే ఆ క్రెడిట్ మొత్తం రాజమౌళికి వెళ్లిపోతుంది. అయితే ప్ర‌భాస్ విష‌యంలో అలా జ‌ర‌గ‌లేదు. బాహుబ‌లి అంటే రాజ‌మౌళి అనే వారి కంటే బాహుబ‌లి అంటే ప్ర‌భాస్ అనే అభిమానులే ఎక్కువ‌గా క‌నిపిస్తారు. హిందీలో అయితే రాజ‌మౌళి అంటే చాలా మందికి తెలియ‌క‌పోవ‌చ్చు. కానీ ప్ర‌భాస్ అంటే మాత్రం ఇట్టే గుర్తుప‌డ‌తారు. ఆర్‌.ఆర్‌.ఆర్ తో య‌న్టీఆర్- చ‌రణ్ కి ప్ర‌భాస్ రేంజ్ లో పాపులారిటీ రావ‌డం చాలా చాలా క‌ష్టం అనే విశ్లేషిస్తున్నారు.