Begin typing your search above and press return to search.

నిఖిల్ కుమార్ బర్త్ డే కానుకగా 'రైడర్' టీజర్..!

By:  Tupaki Desk   |   22 Jan 2021 6:00 AM GMT
నిఖిల్ కుమార్ బర్త్ డే కానుకగా రైడర్ టీజర్..!
X
కన్నడ హీరో యువరాజా నిఖిల్ కుమార్ గౌడ 'జాగ్వార్' సినిమాతో తెలుగు ప్రేక్షకులను కూడా పలకరించాడు. ఈ క్రమంలో 'రైడర్' అనే సినిమాతో మరోసారి టాలీవుడ్ లో తన లక్ ని పరీక్షించుకోడానికి వస్తున్నాడు నిఖిల్ గౌడ. ఈ చిత్రానికి 'గుండెజారి గల్లంతయ్యిందే' 'ఒక లైలా కోసం' 'ఒరేయ్ బుజ్జిగా' వంటి లవ్ అండ్ ఫ్యామిలీ ఎంటర్టైనెర్స్ తీసిన విజయ్ కుమార్ కొండా దర్శకత్వం వహిస్తున్నారు. తెలుగు, కన్నడ భాషల్లో ఏక కాలంలో తెరకెక్కుతోన్న ఈ చిత్రాన్ని లహరి ఫిలిమ్స్‌ బ్యానర్‌ పై చంద్రు మనోహరన్‌ నిర్మిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ఫస్ట్‌ లుక్, మోషన్‌ పోస్టర్‌ మంచి రెస్పాన్స్ తెచ్చుకున్నాయి. ఈ క్రమంలో నేడు హీరో నిఖిల్ గౌడ పుట్టినరోజు సందర్భంగా 'రైడర్' సినిమా టీజర్ ని చిత్ర యూనిట్ విడుదల చేసింది.

'రైడర్' టీజర్ చూస్తుంటే నిఖిల్‌ కుమార్‌ ఒక ఫెరోషియస్‌ యాక్షన్‌ హీరోగా ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు తెలుస్తోంది. కేవలం ఫైటింగ్ సన్నివేశాలతో ఈ టీజర్ ని చూపించి ఇదొక కంప్లీట్ యాక్షన్ ఎంటర్టైనర్ అని తెలియజేసారు. భారీ బడ్జెట్‌ తో రూపొందుతోన్న ఈ చిత్రంలో నిఖిల్ సరసన కశ్మీరా పరదేశీ హీరోయిన్ గా నటించింది. అర్జున్‌ జన్యా సంగీతం సమకూరుస్తున్న ఈ చిత్రానికి శ్రీష కుడువల్లి సినిమాటోగ్రాఫర్ గా వ్యవహరించారు. 'జాగ్వార్' 'సీతారామ కల్యాణ' 'కురుక్షేత్ర' వంటి సినిమాల తర్వాత నిఖిల్ కుమార్ నుంచి నాల్గవ సినిమాగా వస్తున్న 'రైడర్' ఎలాంటి విజయాన్ని నమోదు చేస్తుందో చూడాలి.