Begin typing your search above and press return to search.

వర్మ కు ఇక అమెజాన్‌ లేదా నెట్‌ ప్లిక్స్‌ దిక్కు

By:  Tupaki Desk   |   6 Dec 2019 5:57 AM GMT
వర్మ కు ఇక అమెజాన్‌ లేదా నెట్‌ ప్లిక్స్‌ దిక్కు
X
వివాదాస్పద దర్శకుడు రామ్‌ గోపాల్‌ వర్మ తెరకెక్కించిన 'కమ్మ రాజ్యంలో కడప రెడ్లు' సెన్సార్‌ కష్టాలను ఎదుర్కొంటుంది. ఈ సినిమాకు అమ్మ రాజ్యంలో కడప బిడ్డలు అంటూ టైటిల్‌ మార్చినా కూడా సినిమా విడుదలకు సెన్సార్‌ ఒప్పుకునే పరిస్థితి కనిపించడం లేదు. సినిమాలో సగం కంటే ఎక్కువ సీన్స్‌ పై సెన్సార్‌ బోర్డు అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నట్లుగా సమాచారం అందుతోంది. సెంట్రల్‌ సెన్సార్‌ బోర్డు కు వెళ్లి నా కూడా వర్కౌట్‌ అయ్యేలా లేదు. దాంతో వర్మ తన సినిమాను విడుదల చేయడం కష్టం అంటూ సినీ వర్గాల వారు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

ఎలాగైనా తన సినిమా ను జనాలకు రీచ్‌ అవ్వాలనే ఉద్దేశ్యంతో వర్మ థియేటర్లలో కాకుండా నేరుగా విడుదల చేయాలనే నిర్ణయానికి వచ్చినట్లుగా సమాచారం అందుతోంది. మామూలు గా అయితే సినిమాలు విడుదలైన కొన్ని వారాల తర్వాత అమెజాన్‌ లేదా నెట్‌ ప్లిక్స్‌ లో వస్తాయి. కాని వర్మ మాత్రం తన అమ్మ రాజ్యంలో కడప బిడ్డలు సినిమాను ముందే అంటే థియేటర్లలో విడుదల కాకుండానే ఆన్‌ లైన్‌ లో విడుదల చేసే అవకాశం కనిపిస్తుంది.

రామ్‌ గోపాల్‌ వర్మ అమ్మ రాజ్యం లో కడప బిడ్డలు సినిమా కు భారీగా ఖర్చు పెట్టింది ఏమీ లేదట. కనుక ఆన్‌ లైన్‌ రైట్స్‌ ద్వారా కూడా ఈజీగానే బడ్జెట్‌ రికవరీ అవుతుందని టాక్‌ వినిపిస్తుంది. వర్మ గతంలో కూడా సెన్సార్‌ ఇబ్బందులు ఎదుర్కొన్నాడు. కాని మొదటి సారి ఇలా ఆన్‌ లైన్‌ ద్వారా రామ్‌ గోపాల్‌ వర్మ తన సినిమాను విడుదల చేసేందుకు సిద్దం అవుతున్నట్లు గా ప్రచారం జరుగుతోంది. ఈ విషయమై సినీ వర్గాల నుండి క్లారిటీ రావాల్సి ఉంది.

అమ్మ రాజ్యం లో కడప బిడ్డలు సినిమా ప్రధానంగా ఆంధ్ర ప్రదేశ్‌ రాజకీయాల చుట్టు తిరగనున్నట్లు గా ట్రైలర్‌ మరియు పాటలు చూస్తుంటే అనిపిస్తుంది. ఏపీ ప్రధాన రాజకీయ నాయకులకు సంబంధించిన పాత్రలు సినిమాపై ఆసక్తిని పెంచాయి. ఈ సినిమాను అస్సలు వివాదాస్పదం కాకుండా తీస్తున్నట్లుగా మొదటి నుండి చెబుతూ వస్తున్న వర్మకు సెన్సార్‌ ఈ విధంగా షాక్‌ ఇచ్చింది.