ఆర్జీవీ మారడు.. పబ్బులో అమ్మాయితో అదే రచ్చ!

Fri Jan 28 2022 10:00:03 GMT+0530 (IST)

RGV with the girl in the pub

ఎవరేమనుకున్నా ఆర్జీవీ మారడు. తన లైఫ్ స్టైల్ ని మార్చడు. తనకు నచ్చినట్టే అంతా నా ఇష్టం అన్న తీరుగానే వ్యవహరిస్తాడు. ఇక ఇటీవలి కాలంలో తన సినిమా కొండా ప్రమోషన్ ని పరాకాష్టకు చేరుస్తున్న ఆర్జీవీ ఆ సినిమా ట్రైలర్ ని లాంచ్ చేసిన సంగతి తెలిసిందే.ఉన్నట్టుండి సడెన్ గా ఇలా పబ్బులో మందు బాటిల్ అమ్మాయితో ప్రత్యక్షమయ్యాడు. ఓ చేత్తో మందు బాటిల్ పట్టుకుని మరో చేతిని అమ్మాయి భుజంపై వేస్తూ ఘాడంగా ముద్దాడేస్తున్నాడు. మందు ముక్క మగువ లేనిదే ఆర్జీవీ జీవించలేడు! అన్నంతగా ఉంది ఈ వ్యవహారం.

కిక్కు లేనిదే లైఫ్ లేనే లేదు. ఏం చేసినా బహిరంగంగా అందరికీ చెప్పి చేయడమేననేది ఆర్జీవీ ఫిలాసఫీ. తాను చెప్పిందే చేస్తున్నాడు. అందుకే నెటిజనులు కూడా `బతికితే నీలానే బతకాలి బాసూ` అంటూ కీర్తించేస్తున్నారు.  పబ్ లో అమ్మాయిలతో చిందులు వేస్తున్న వీడియోని వర్మ తాజాగా తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేయగా క్లిక్ లు లైక్ లతో హోరెత్తుతోంది. ఈ వీడియోతో పాటు ఆయన పోస్ట్ చేసిన ఫొటోకి క్యాప్షన్ చెబితే రూ. లక్ష రూపాయలు అంటూ ఆర్జీవీ ఆఫర్ చేశాడు. ప్రస్తుతం ఈ వీడియో అంతర్జాలంలో వైరల్ గా మారుతోంది.