హైదరాబాద్ 'కేవ్'ని తలదన్నేలా..

Mon Jan 27 2020 14:37:22 GMT+0530 (IST)

RGV raves about Puris new ADDA

డ్యాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ హైదరాబాద్ లో కేవ్ (ఆఫీస్)ని నిర్మించిన సంగతి తెలిసిందే. టాలీవుడ్ లోనే అల్ట్రా రిచ్ ఆఫీస్ ఇది. దాదాపు 20 కోట్ల పెట్టుబడితో కేవ్ ని నిర్మించారు. రికార్డింగ్ థియేటర్.. పోస్ట్ ప్రొడక్షన్ స్టూడియోలు సహా సకల సౌకర్యాలతో కేవ్ ని నిర్మించి సినిమాపై తనకు ఉన్న ఫ్యాషన్ ఎలాంటిదో చూపించాడు. తన అసిస్టెంట్ల కోసం.. క్రియేటివ్ టీమ్ కోసం ప్రత్యేకించి రూమ్ లు ఇందులో ఏర్పాటు చేశారు. టాలీవుడ్ స్టార్ హీరోలు సైతం ఈ రేంజు ఆఫీస్ ని ప్లాన్ చేయలేక పోయారంటే అర్థం చేసుకోవచ్చు. పూరి ఆలోచనా ధోరణి కి కేవ్ ఒక దర్పణం అనే చెప్పాలి. ఈ ఆఫీస్ ఆద్యంతం క్రియేటివిటీతో ది బెస్ట్ అన్న ప్రశంసలు దక్కించుకుంది.తాజాగా డ్యాషింగ్ డైరెక్టర్ హైదరాబాద్ కేవ్ ని తలదన్నేలా ముంబైలో అధునాతన ఆఫీస్ ను లాంచ్ చేసాడుట. అది చూసిన పూరి గురువుగారు.. దర్శకుడు రాంగోపాల్ వర్మ ఫిదా అయి పోయాడు. ముంబై లో నా శిష్యుడి ఆఫీస్ చూసారా? ఎంత రిచ్ గా ఉందో? హైదరాబాద్ కేవ్ కన్నా పదింతలు కాస్ట్ లీగా ఉంది అంటూ వర్మ ట్విటర్ వేదికగా ప్రశంసలు కురిపించారు. హైదరాబాద్ కేవ్.. ముంబై కేవ్ ముందు దిగ దుడుపే అని ఆర్జీవీ పొగిడేశాడు. పూరి-చార్మి తమ టేస్ట్ కు తగ్గట్లు ఆఫీస్ ను ఏర్పాటు చేసుకున్నారని సంతోషం వ్యక్తం చేశాడు.

ఉన్నట్టుండి పూరి ఇలా ముంబైలో ఎందుకు మకాం వేశాడు? హుటా హుటిన అక్కడ సొంత ఆఫీస్ ఎందుకు రెడీ చేశాడు? అతడు బాలీవుడ్ కి వెళ్లిపోతున్నాడా? అంటూ సందేహాలు వ్యక్తమవుతున్నాయి. అయితే ఈ ఆఫీస్ కేవలం ఫైటర్ మూవీ కోసం మాత్రమే. పూరి- విజయ్ దేవరకొండ `ఫైటర్` ప్రస్తుతం ముంబై లోనే తెరకెక్కుతోంది. అక్కడ ఓ కీలక షెడ్యూల్ ని ప్లాన్ చేశారు. ఇందులో భాగంగా కొన్ని రోజుల పాటు అక్కడే ఉండాల్సి ఉంటుందట. అందుకే పూరి-చార్మికి నచ్చినట్లు కొత్త ఆఫీస్ ని లాంచ్ చేశారని తెలుస్తోంది. ఇది పర్మినెంటా? తాత్కాలికమా? లేక సబ్ ఆఫీస్ లా ఉంటుందా? అన్నది తెలియాల్సి ఉంది. పర్మినెంట్ కాకపోతే ఇంతగా ఆఫీస్ ని ప్రిపేర్ చేయరు కదా! అన్న సందేహం పూరి ఫ్యాన్స్ లో వ్యక్తమవుతోంది.