Begin typing your search above and press return to search.

ప‌వ‌ర్ స్టార్ అన్న బిరుదును కెలికిన ఆర్జీవీ

By:  Tupaki Desk   |   21 Jan 2020 9:13 AM GMT
ప‌వ‌ర్ స్టార్ అన్న బిరుదును కెలికిన ఆర్జీవీ
X
వివాదం - ఆర్జీవీ జోడుగుర్రాలు. క‌లిసే ప‌య‌నం సాగించ‌డం కామ‌న్. త‌న సినిమాలు రిలీజైనా.. లేదూ మెగా ఫ్యామిలీ హీరోల‌తో ఏదైనా వార్ న‌డిచినా ఆర్జీవీ ఏ ర‌కంగా రెచ్చిపోతాడో ప్ర‌త్య‌క్షంగా చూశాం. ఇక మెగా హీరోల్లో ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ల్యాణ్ తో ఆర్జీవీ వివాదాస్ప‌ద‌ ఎపిసోడ్స్ ఎంత‌టి సంచ‌ల‌నం అయ్యాయో తెలిసిందే. పిలిచి మ‌రీ కెలుక్కోవ‌డం ఆర్జీవీ స్టైల్. ప్ర‌తిసారీ ప‌వ‌న్ పై అత‌డి వైఖ‌రి గురించి తెలిసిందే.

ఇప్ప‌టికే మెగా బ్ర‌ద‌ర్స్ చిరు- ప‌వ‌న్ ల‌పై ర‌క‌ర‌కాల సంద‌ర్భాల్లో ఆర్జీవీ ర‌క‌ర‌కాలుగా సెటైర్లు వేశారు. శ్రీ‌ రెడ్డి వివాదంలోనూ ప‌వ‌ర్ స్టార్ పేరు తో ముడిపెట్టి చీవాట్లు తిన్నారు. ఇక‌పోతే లేటెస్టుగా మ‌రోసారి ప‌వ‌ర్ స్టార్ అన్న బిరుదును ఆర్జీవీ కెలికారు. మెగా ఫ్యామిలీలో నిజ‌మైన‌ ప‌వ‌ర్ స్టార్ అల్లు అర్జున్ మాత్ర‌మే! అన్న అర్థంలో ఆయ‌న చేసిన ట్విట్ట‌ర్ వ్యాఖ్య వైర‌ల్ గా మారింది. ప్ర‌స్తుతం ఈ కామెంట్ బ‌న్ని ఫ్యాన్స్ స‌హా ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ల్యాణ్‌ అభిమానుల్లోనూ హాట్ టాపిక్ గా మారింది.

వెట‌ర‌న్ క‌మెడియ‌న్ అల్లు రామ‌లింగ‌య్యకు సిస‌లైన న‌ట‌ వార‌సుడిగా సూప‌ర్ స్టార్ - మెగాస్ ని అల్లు అర్జున్ అధిగ‌మించాడ‌ని ఆర్జీవీ వ్యాఖ్యానించారు. అల్లు అర్జున్ మాత్ర‌మే నిజ‌మైన మెగా ప‌వ‌ర్ స్టార్!!`` అంటూ ట్వీట్ చేసి వేడి పెంచారు. ఇప్ప‌టికే సంక్రాంతి పందెంలో బ‌న్ని హ‌వా గురించి తెలిసిందే. ఏపీ- తెలంగాణ స‌హా ఓవ‌ర్సీస్- అమెరికాలోనూ బాక్సాఫీస్ వ‌ద్ద అల వైకుంఠ‌పుర‌ములో హ‌వా క‌నిపించింది. ఇప్ప‌టికే 100 కోట్ల షేర్ క్ల‌బ్ లో చేరింది. కేవ‌లం అమెరికాలో 21 కోట్ల వ‌సూళ్లు సాధించింది ఈ చిత్రం. స‌రిగ్గా ఇలాంటి స‌మ‌యం లో ఆర్జీవీ ట్వీట్ వైర‌ల్ గా మారింది. స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ పై ఆర్జీవీ ప్రేమ కురిపించారా? లేక ప‌వ‌ర్ స్టార్ ని చిన్నబుచ్చద‌లిచారా? అన్న‌ది అటుంచితే.. ప్ర‌స్తుతం ఆర్జీవీ ట్వీట్ స‌ర్వ‌త్రా హాట్ టాపిక్ గా మారింది.