బ్రేకింగ్: వర్మ ‘క్లైమాక్స్’ రెడీ.. టికెట్ రేట్ ఫిక్స్

Fri May 29 2020 15:20:26 GMT+0530 (IST)

RGV World Theatre Launched with Mia Malkova CLIMAX

వివాదాస్పద విలక్షణ దర్శకుడు రాంగోపాల్ వర్మ తాజాగా తెరకెక్కించిన చిత్రం ‘క్లైమాక్స్’. పోర్న్ స్టార్ మియా మాల్కోవాని హీరోయిన్ గా పెట్టి మొత్తం శృగార రసభరితంగా తీసిన ఈ మూవీపై కుర్రకారులో తెగ అంచనాలున్నాయి.ప్రస్తుతం థియేటర్స్ అన్నీ బంద్ అయిన వేళ.. వర్మ ఆన్ లైన్ లోనే ‘క్లైమాక్స్ ’ మూవీని రిలీజ్ చేయాలి భావిస్తున్నాడు. డిజిటల్ పార్మాట్ లో స్పెషల్ గా ‘ఆర్జీవీ వరల్డ్’ అనే యాప్ ను డిజైన్ చేయించి శ్రేయాస్ ఎంటర్ టైన్ మెంట్స్ వాళ్లతో కలిసి తన ‘క్లైమాక్స్’ మూవీని జూన్ 6న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ చేయాలని వర్మ డిసైడ్ అయ్యాడు. ఈ శృంగార చిత్రాన్ని డైరెక్ట్ గా రిలీజ్ చేస్తే సెన్సార్ ఇబ్బందులు ఎదురవుతాయి కాబట్టి ఆ ఇబ్బందులు లేకుండా వర్మ స్పెషల్ గా తన పేరుతో యాప్ ను డిజైన్ చేసి అందులో ఈ మూవీకి కొంత రేట్ ను పెట్టి రిలీజ్ చేయడానికి సంకల్పించారు.

ఆర్జీవీ ‘క్లైమాక్స్ ’ మూవీని చూడాలంటే ఒక వ్యూస్ కు రూ.100గా వర్మ ఫిక్స్ చేశాడు. జూన్ 6న రాత్రి 9 గంటలకు సినిమా ఆన్ లైన్లో సందడి చేయనున్నట్లు వర్మ తెలిపారు.

ఇప్పటికే ‘క్లైమాక్స్ ’ ట్రైలర్ ను రిలీజ్ చేసిన వర్మ దాంతో హైప్ సృష్టించాడు. ఇప్పుడు శనివారం సాయంత్రం 5 గంటలకు సెకండ్ ట్రైలర్ రిలీజ్ చేయనున్నట్లు తెలిపాడు. మరి వర్మ ‘క్లైమాక్స్’ ఎలాంటి ఫలితం అందుకుంటుందనేది వేచిచూడాలి.