Begin typing your search above and press return to search.

ఆర్జీవీ ట్రెండింగ్ చేసిన ‘ఒమిక్రాన్’ ట్వీట్ కథేంటి?

By:  Tupaki Desk   |   3 Dec 2021 11:30 AM GMT
ఆర్జీవీ ట్రెండింగ్ చేసిన ‘ఒమిక్రాన్’ ట్వీట్ కథేంటి?
X
ఈ వివాదాస్పద రాంగోపాల్ వర్మ ఊరికే పొద్దు గడవదు. సమాజంలో ఏది జరిగితే దాని మీద స్పందిస్తాడు. తనదైన శైలిలో సెటైర్లు వేస్తాడు. అంతటి కరోనా లాక్ డౌన్ సమయంలో కూడా ‘కరోనా’ పేరుతో సినిమా తీసి రిలీజ్ చేసిన ఘనుడు మన రాంగోపాల్ వర్మ. కొత్తగా ఏదైనా పుట్టుకొచ్చిందంటే చాలు దాని పూర్వపరాలు తవ్వితీయడం.. రంధ్రానేశ్వషణ చేయడం రాంగోపాల్ వర్మకు అలవాటు.

తాజాగా దక్షిణాఫ్రికా దేశంలో కరోనా వైరస్ ‘ఒమిక్రాన్’గా రూపాంతరం చెందింది. ఇదిప్పుడు ప్రపంచ దేశాలను గడగడలాడిస్తోంది. భారతదేశంలోకి కూడా ఎంట్రీ ఇచ్చింది. బెంగళూరులో ఐదు కేసులు నమోదయ్యాయి. ఈ క్రమంలోనే ‘ఒమిక్రాన్’పై చర్చ మొదలైంది.

గురువారం సాయంత్రం గూగుల్ ట్రెండ్ లో టాప్ 25 సెర్చ్ కంటెంట్ లో మూడు ఒమిక్రాన్ సంబంధించిన టాపిక్స్ ఉన్నాయి. విశేషం ఏంటంటే.. అమెరికాలో ఇది ఒక సినిమాకు సంబంధించిన సెర్చింగ్ ద్వారా ట్రెండ్ లోకి రావడం విశేషం.

1963లో అమెరికాలో ‘ఒమిక్రాన్’ పేరుతో ఓ సినిమా వచ్చింది. అది ఇటాలియన్ సైఫై సినిమా కథ. ఏలియన్ బాడీ స్నాచర్స్ చుట్టూ తిరుగుతుంది. అంతేకానీ పాండెమిక్స్ గురించి కాదు.. అయితే ఈ సినిమా ట్రెండ్ ఎలా అయ్యిందనేది ఆసక్తి రేపుతోంది.

ఐర్లాండ్ కు చెందిన డైరెక్టర్ బెక్కీ చీట్లే సైఫై క్లాసిక్ సినిమా ‘ది ఒమిక్రాన్ వేరియంట్’పేరుతో సినిమా పోస్టర్లను ఫొటోషాప్ లో ఎడిట్ చేసి ‘కింద ట్యాగ్ లాగా భూమి మొత్తం శ్మశానంగా మారిన రోజు అంటూ క్యాప్షన్ జత చేసింది.

ఇది నిజమని మనం రాంగోపాల్ వర్మ నుంచి మొదలు కొని అందరూ ఓ సినిమా ఉందని.. ఆ టైంలోనే పరిస్థితులను ఊహించారని తెగ వైరల్ చేస్తున్నారు. మన టాలీవుడ్ దర్శకుడు రాంగోపాల్ వర్మ కూడా ఆ పోస్టర్ ను తన సోషల్ మీడియా ఖాతాలో షేర్ చేశాడు.

తను ఎడిట్ చేసిన పోస్టర్ వైరల్ కావడంపై బెక్కీ చీట్లే స్పందించింది. దీన్నితాను సరదాగా ఎడిట్ చేశానని.. కంగారు పడాల్సిన అవసరం లేదని స్ఫష్టం చేసింది.