Begin typing your search above and press return to search.

'పవర్ స్టార్' ఫోటో షూట్ విశేషాలు షేర్ చేసిన డైరెక్టర్...!

By:  Tupaki Desk   |   9 July 2020 11:30 AM GMT
పవర్ స్టార్ ఫోటో షూట్ విశేషాలు షేర్ చేసిన డైరెక్టర్...!
X
సెన్సేషనల్ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ 'పవర్ స్టార్' అనే సినిమా అనౌన్స్ చేసిన విషయం తెలిసిందే. ఈ రోజు ఈ సినిమాకి సంబంధించిన ఫస్ట్ లుక్ కూడా రిలీజ్ చేసారు వర్మ. ఆర్జీవీ వరల్డ్ థియేటర్ లో త్వరలోనే 'పవర్ స్టార్' సినిమా రిలీజ్ కానుందని.. 'జై పవర్ స్టార్' అని ట్వీట్ చేసారు. ఇక 'పవర్ స్టార్' టైటిల్ లోగో మధ్యలో పవన్ కళ్యాణ్ స్థాపించిన 'జనసేన' పార్టీ ఎలక్షన్ సింబల్ అయిన 'గ్లాస్' ని పెట్టాడు. అంతేకాకుండా ఇది 'ఎన్నికల ఫలితాల తర్వాత కథ' అని ఫస్ట్ లుక్ పోస్టర్ ద్వారా వెల్లడించారు. ఈ క్రమంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ని పోలి ఉన్న ఆర్టిస్ట్ ఫోటోలు సోషల్ మీడియాలో రిలీజ్ చేసాడు. ''POWER STAR సినిమాలో ప్రధాన పాత్ర పోషిస్తున్న యాక్టర్ నేను చూసిన స్టార్స్ అందరి కంటే ఎక్కువ పవర్‌ ఫుల్'' అని చెప్పుకొచ్చాడు.

అంతేకాకుండా ''ఇండియన్ శారీలో ఉన్న ఒక రష్యన్ మహిళతో పాపిల్లాన్ అనే ఫ్రెంచ్ పుస్తకాన్ని చదువుతున్నప్పుడు అర్జెంటియన్ లెజెండ్ చే గువేరా ఫోటో గోడపై వేలాడదీసి ఉంది.. ఈ చిత్రంలోని లీడ్ రోల్ నిజంగా గ్లోబల్ పవర్‌ స్టార్'' అని మరో ట్వీట్ చేసి మెయిన్ లీడ్ ప్లే చేస్తున్న నటుడికి ఎదురుగా ఓ లేడీ నిలబడి ఉన్న ఫోటో షేర్ చేసారు. అంతేకాకుండా 'పవర్ స్టార్' సినిమా కోసం ప్రధాన పాత్రదారులతో తీసిన ఫోటో షూట్ చిత్రాలు కూడా పంచుకున్నారు. ''PK, MS, NB, TS, ఒక రష్యన్ మహిళ, నలుగురు పిల్లలు మరియు 8 గేదెలు మరియు RGV నటించిన POWER STAR సినిమా త్వరలో ఆర్జీవీ వరల్డ్ థియేటర్ లో విడుదల కానుంది. ఈ ఫొటోల్లో ఏవైనా పోలికలు ఉంటే అది యాదృచ్చికం మాత్రమే'' అని పేర్కొన్నారు. దీంతో సోషల్ మీడియాలో పవన్ కళ్యాణ్ అభిమానులు వర్మపై విమర్శల వర్షం కురిపిస్తున్నారు.