క్లిక్ క్లిక్ : థ్రిల్లర్ అంటూ ఈ రొమాంటిక్ స్టిల్స్ ఏంటీ వర్మ?

Tue Jul 14 2020 15:40:02 GMT+0530 (IST)

Click Click: Thriller What are these romantic stills?

రామ్ గోపాల్ వర్మ క్రియేటివిటీ పీక్స్ కు చేరింది. మొన్నటి ఆయన క్రియేటివిటీకి సెన్సార్ ఇంకా పలు నిబంధనలు అడ్డుగా నిలిచాయి. కాని డిజిటల్ ఫార్మెట్ లో సినిమా విడుదలకు మంచి స్పందన ఉండటంతో పాటు ఇప్పటికే విడుదల చేసిన సినిమాలు మంచి వసూళ్లను రాబట్టిన నేపథ్యంలో వర్మ వరుసగా సినిమాలను తెరకెక్కిస్తున్నాడు. ఒక వైపు ‘పవర్ స్టార్’ అనే చిత్రాన్ని రూపొందిస్తూనే మరో వైపు ‘థ్రిల్లర్’ అనే చిత్రాన్ని చేస్తున్నాడు. థ్రిల్లర్ చిత్రం ద్వారా అప్సరను హీరోయిన్ గా పరిచయం చేయబోతున్నట్లుగా వర్మ ఇప్పటికే ప్రకటించిన విషయం తెల్సిందే.అప్సర వంటి అందెగత్తెను ఇప్పటి వరకు తాను చూడలేదు అంటూ నానా హంగామా చేశాడు. ఒడిషా కు చెందిన ఈ అమ్మడితో వర్మ తీయబోతున్న థ్రిల్లర్ చిత్రం కోసం ఫొటో షూట్ నిర్వహించారు. అప్సరకు జోడీగా ఈ చిత్రంలో రాక్ కచ్చి అనే యువకుడిని వర్మ నటింపజేస్తున్నాడు. అతడు కూడా ఒడిషాకు చెందిన వాడే. ఇద్దరి కాంబోలో చాలా రొమాంటిక్ స్టిల్స్ ను తీయించాడు. వర్మ ఇద్దరిని కూడా పూర్తి నగ్నంగా మార్చి ఫొటో షూట్ చేశాడా అన్నట్లుగా ఈ ఫొటోలు ఉన్నాయి.

వర్మ థ్ల్రిర్ అంటూ థ్రిల్ చేయకుండా రొమాంటిక్ మూడ్ లో సినిమాను నడిపించబోతున్నాడా అంటూ ఈ ఫొటోలు చూస్తుంటే అనుమానం వస్తుంది. అయినా వర్మ చెప్పేదానికి చూపించేదానికి సంబంధం ఉండటం ఎప్పుడో లేకుండా పోయింది. ఇక టైటిల్ కు తగ్గట్లుగా సినిమా ఉంటుందని భావించడం కూడా అవివేకం అవుతుంది. అందుకే వర్మ థ్రిల్లర్ మూవీతో థ్రిల్ చేస్తాడని ఎదురు చూడటం వృథా ప్రయాస అవుతుందని అంటున్నారు. ఈ రొమాంటిక్ స్టిల్స్ చూస్తుంటే ఇదో సెమీ పోరును సినిమా అవుతుందేమో అంటూ అనుమానం వ్యక్తం చేస్తున్నారు.