Begin typing your search above and press return to search.

ష‌ష్ఠిపూర్తి ఏజ్ లో ఆర్జీవీకి అరియానాతో ఎఫైరా?

By:  Tupaki Desk   |   19 Jun 2021 3:30 PM GMT
ష‌ష్ఠిపూర్తి ఏజ్ లో ఆర్జీవీకి అరియానాతో ఎఫైరా?
X
గ‌త కొంత‌కాలంగా ఆర్జీవీ తో బిగ్ బాస్ బ్యూటీ అరియానా ఇంట‌ర్వ్యూ అంటూ సోష‌ల్ మీడియాల్లో బోలెడంత చ‌ర్చ సాగుతున్న సంగ‌తి తెలిసిందే. ఇంత‌కుముందే అరియానా బోల్డ్ ఇంట‌ర్వ్యూకి సంబంధించిన ప్రోమోలో ఆర్జీవీ తో క‌లిసి జిమ్ చేస్తున్న ఫోటోలు వీడియోలు అంత‌ర్జాలంలో వైర‌ల్ అయ్యాయి. వాటికి యూత్ నుంచి చ‌క్క‌ని స్పంద‌న ద‌క్కింది.

తాజాగా ఆర్జీవీతో అరియానా బోల్డ్ ఇంట‌ర్వ్యూలో బోలెడ‌న్ని ఛ‌మ‌క్కులు యువ‌త‌రంలో చ‌ర్చ‌కు వ‌చ్చాయి. ఈ ఇంట‌ర్వ్యూలో ఆర్జీవీ త‌న‌వైన ఛ‌మ‌క్కుల‌తో ప‌రిహాసంతో అల‌రించారు. కంటెంట్ ని ఎలా డ్రైవ్ చేస్తే లాజిక్ తెలిసిన‌ వ‌ర్మ త‌న‌దైన శైలిలో ఎలివేట్ చేసిన తీరు ఆక‌ట్టుకుంది. బోల్డ్ గా ఉండాలి.. కానీ లాజిక్ ఉండాలి.. అన్న ప‌ద్ధ‌తిలో ఈ ఇంట‌ర్వ్యూ ఆద్యంతం కొన‌సాగింది.

ఇక ఇందులో అరియానాతో ఆర్జీవీ ఎఫైర్ క‌హానీ కూడా ఆస‌క్తిని క‌లిగించింది. ఎఫైర్ ఊహాగానాలకు వర్మ అదిరిపోయే కౌంటర్ ఇచ్చాడు. అన్నివేళ‌లా యాంక‌ర్ల‌పై బోల్డ్ కామెంట్ల‌తో విరుచుకుప‌డే ఆర్జీవీ య‌థావిధిగా అరియానా థై సొగ‌సుల‌పై మ‌న‌సు పారేసుకున్నాన‌ని సూటిగానే చెప్పారు. ఓవైపు జిమ్ చేస్తూనే ఆ ఇద్ద‌రూ మాట్లాడుకున్నారు. ఆర్జీవీ ర‌క‌ర‌కాలుగా అరియానాను పొగిడేశారు. నేను చేసే కామెంట్స్ నువ్వు స్పోర్టివ్ గా తీసుకోవడం నాకు ఇంకా బాగా నచ్చింది అందుకే నేను నీకు పడిపోయాను!! అంటూ త‌న‌దైన టైమింగ్ తో ఆర్జీవీ
మ్యాజిక్ వ‌ర్క‌వుటైంది.

``నీ కాస్ట్యూమ్ కంటే కూడా నీకు దేవుడు ఇచ్చిన గ్గొప్ప కాస్ట్యూమ్ ఏమిటో తెలుసా? నీ థైస్`` అంటూ వర్మ అరియానాను హ‌గ్ చేసుకుని చేసిన హంగామా మ‌రో హైలైట్. ష‌ష్ఠిపూర్తికి ఏడాది పాటు వేచి చూడాల్సి ఉండ‌గా ఆర్జీవీ(59) ప‌రాచికాలేమిటో! అంటూ ఈ హ‌గ్ చూసిన వారంతా ముచ్చ‌టించుకున్నారు.

అరియానాకు ఆర్జీవితో ఎఫైర్ ఉంద‌ని వ్యాఖ్య‌లు వినిపిస్తున్నాయి? అని ప్ర‌శ్నించ‌గా... ``ఎవరూ మంచి ఫ్రెండ్షిప్ ను తట్టుకోలేరు. అలాంటివి అనుకోకపోతే సోషల్ మీడియా వాళ్లకు నిద్ర పట్టదు. అందుకే వాళ్ళను ప‌ట్టించుకోవాల్సిన అవసరం లేదు. మనం చేయాల్సింది మనం చేద్దాం. వాళ్ళు చేయాల్సింది వాళ్ళు చేస్తారు..`` అని ఆర్జీవీ అన్నారు. బోల్డ్ గాళ్ అబ్బాయితో ఉంటే దానిని త‌ప్పుగా అర్థం చేసుకుంటారు క‌దా? అన్న ప్ర‌శ్న‌కు స‌మాధానంగా ఎవరికి నచ్చింది వాళ్ళు చేయాలని .. ఎవరో ఎదో అన్నారని అనవసరంగా ఆలోచించవద్దని ఆర్జీవీ త‌న‌దైన శైలిలో వివ‌ర‌ణ ఇచ్చారు.

మొత్తానికి ఇంట‌ర్వ్యూ ఆద్యంతం లైవ్ లీగా ఛ‌మ‌క్కుల‌తో ఆక‌ట్టుకుంది. జిమ్ డ్రెస్ లో అరియానా అంద‌చందాలు ఇంట‌ర్వ్యూ ఆద్యంతం యంగేజ్ చేసిన మ‌రో హైలైట్ ఎలిమెంట్.