విమర్శలొచ్చినందుకా ఈ కవరింగ్!

Wed Sep 11 2019 11:59:45 GMT+0530 (IST)

RDX Love Movie

ఏ సినిమాకైనా హైప్ తేవడంలో టీజర్ ట్రైలర్లది చాలా కీలక పాత్ర. కంటెంట్ మీద ఒక అవగాహన వచ్చి చూడాలా వద్దా అని నిర్ణయించుకోవడంలో వీటి మీద ఆధారపడే వాళ్లే అధికం. అందుకే వీటిని కట్ చేసే విషయంలో దర్శక నిర్మాతలు చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఇక్కడ ఫస్ట్ ఇంప్రెషన్ ఈజ్ బెస్ట్ అనే సూత్రం అక్షరాల సరిపోతుంది. విషయానికి వస్తే నిన్న ఆర్డిఎక్స్ లవ్ ట్రైలర్ రిలీజయింది. ఇంతకు ముందే టీజర్ వచ్చింది. దాని మీద బోలెడన్ని కామెంట్స్ విమర్శలు.పాయల్ రాజ్ పుత్ - తేజుస్ ల మధ్య హాట్ కెమిస్ట్రీని విపరీతంగా ఎక్స్ పోజ్ చేయడంతో పాటు ఫక్తు డబుల్ మీనింగ్ డైలాగులు నింపడంతో ఇదేదో అడల్ట్ మూవీ అనుకుని అంచనాలు పెంచేసుకున్నారు వాటిని ప్రత్యేకంగా ఇష్టపడే ఆడియన్స్. తీసిందేమో ప్రముఖ నిర్మాత సి కళ్యాణ్. మరి ఇలాంటి కంటెంట్ ఏంటి అనే క్రిటిసిజం కూడా గట్టిగానే వచ్చింది

ఇవన్నీ విని అసలు సినిమా ఉద్దేశం పక్కదారి పడుతోందని గుర్తించారో ఏమో ట్రైలర్ లో మాత్రం అవుట్ అండ్ అవుట్ లేడీ ఓరియెంటెడ్ యాక్షన్ ఎంటర్ టైనర్ అనే తరహాలో ఫీలింగ్ కలిగించారు. టీజర్ లో రెచ్చిపోయి హాట్ షో చేసిన పాయల్ ఇందులో మాత్రం బోలెడు సూక్తులు వల్లిస్తూ ఫైట్లు కూడా చేసేసింది. ఒకరకంగా చెప్పాలంటే రెండు ఒకే సినిమావే అంటే నమ్మడం కష్టం అనిపించేలా. మొత్తానికి విమర్శలు ఆర్డిఎక్స్ టీం మీద గట్టి టీమ్ ప్రభావమే చూపించినట్టు ఉన్నాయి. త్వరలోనే విడుదల కానున్న ఈ ఆర్డిఎక్స్ లవ్ లో ఆరెక్స్ 100ని మించిన మసాలా ఉన్న మాట మాత్రం టీజర్ చూస్తే నిజమే అనిపిస్తుంది