Begin typing your search above and press return to search.

RC 15: రిలీజ్ ప్లాన్ మళ్ళీ మారింది?

By:  Tupaki Desk   |   25 May 2022 1:30 AM GMT
RC 15: రిలీజ్ ప్లాన్ మళ్ళీ మారింది?
X
RRR సినిమా తర్వాత ఆచార్య సినిమాతో కూడా మంచి విజయాన్ని అందుకోవాలని అనుకున్న రామ్ చరణ్ తేజ కు చేదు అనుభవం మిగిలింది. తన తండ్రి తో మొదటి సారి చేసిన యాక్షన్ మూవీ బాక్సాఫీస్ వద్ద దారుణమైన దెబ్బ కొట్టిన విషయం తెలిసిందే. ఇక ఆ చేదు అనుభవాన్ని మర్చిపోయి రామ్ చరణ్ తేజ్ మొన్నటివరకు శంకర్ సినిమా తో బిజీగా కనిపించాడు. ఆ సినిమాలో విభిన్నమైన గెటప్లలో అలరించబోతున్న రామ్ చరణ్ ఎలాగైనా బాక్సాఫీస్ వద్ద మంచి హిట్ ను సొంతం చేసుకోవాలి అని అనుకుంటున్నాడు.

అయితే ఆ సినిమాకు కూడా ఊహించని విధంగా కొన్ని ఆటంకాలు జరుగుతున్నట్లుగా తెలుస్తోంది. ఏమైందో ఏమో కానీ ఇటీవల మరొకసారి ఆ సినిమాకు సంబంధించిన కీలకమైన షెడ్యూల్ క్యాన్సిల్ అయింది. దిల్ రాజు ఈ సినిమాను నిర్మిస్తున్న విషయం తెలిసిందే. సంచలన దర్శకుడు శంకర్ ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న ఈ సినిమా షూటింగ్ మొన్నటి వరకు ఆంధ్రప్రదేశ్ లో జరిగింది. రామ్ చరణ్ కు సంబందించిన కొన్ని ఫోటోలు కూడా సోషల్ మీడియాలో లీక్ అయిన విషయం తెలిసిందే.

అయితే మరొక ముఖ్యమైన షెడ్యూల్ ను ఇటీవల భోపాల్ లో మొదలుపెట్టాలి అని అనుకున్నారు. కానీ హఠాత్తుగా ఆ షెడ్యూల్ క్యాన్సిల్ అయినట్లుగా తెలుస్తోంది. దీంతో రిలీజ్ డేట్ విషయంలో కూడా మళ్లీ కన్ఫ్యూజన్ నెలకొన్నట్లు సమాచారం.

RC 15 సినిమాను ఎలాగైనా సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని దిల్ రాజు ప్లాన్ చేసుకున్న విషయం తెలిసిందే. కానీ శంకర్ ఎప్పటిలానే మళ్లీ షూటింగ్ కోసం చాలా ఎక్కువ సమయాన్ని తీసుకుంటున్నాడు.

RC 15 తప్పకుండా సంక్రాంతి వస్తుంది అని ప్రేక్షకులు కూడా మొన్నటి వరకు చాలా నమ్మకంతో ఉన్నారు. అయితే మరోసారి కీలకమైన షటిల్ వాయిదా పడడంతో రిలీజ్ డేట్ పై ప్రభావం చూపే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది.

ఈ సినిమాను సంక్రాంతికి విడుదల చేయడం కుదరకపోతే వచ్చే ఏడాది సమ్మర్ లో విడుదల చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ప్లాన్ ప్రకారం వెళితే సినిమా మర్చిలో వచ్చే అవకాశం ఉందట. మరి ఈ టాక్ ఎంతవరకు నిజమో తెలియాలి అంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే.