Begin typing your search above and press return to search.

రామ్ చరణ్ 15.. ఈ టైటిల్ ఫిక్స్?

By:  Tupaki Desk   |   26 Jun 2022 8:30 AM GMT
రామ్ చరణ్ 15.. ఈ టైటిల్ ఫిక్స్?
X
టాలీవుడ్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ RRR సినిమా తో పాన్ ఇండియా బాక్సాఫీస్ వద్ద మొదటి విజయాన్ని అందుకోవడంతో ఆ తర్వాత రాబోయే సినిమాలను కూడా అదే తరహాలో విడుదల చేయాలని అడుగులు వేస్తున్న విషయం తెలిసిందే. అయితే ఇటీవల రామ్ చరణ్ తేజ్ ఆచార్య సినిమాతో ఊహించని విధంగా ఒక భారీ అపజయాన్ని ఎదుర్కోవాల్సి వచ్చింది.

సొంత భాషలో నే తండ్రితో కలిసి నటించి ఆచార్య సినిమా దాదాపు 70 కోట్లకుపైగా నష్టాలను మిగల్చడం పెద్ద షాక్ అనే చెప్పాలి. అందుకే తదుపరి సినిమాతో ఎలాగైనా మంచి విజయాన్ని అందుకోవాలని చూస్తున్నాడు. ప్రస్తుతం అభిమానుల ఫోకస్ మొత్తం కూడా శంకర్ సినిమా పైనే ఉంది. రామ్ చరణ్ 15 వ ప్రాజెక్ట్ గా తెరకెక్కుతున్న ఈ సినిమా ఒక డిఫరెంట్ పొలిటికల్ యాక్షన్ డ్రామాగా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.

ఈ సినిమాలో రామ్ చరణ్ తేజ్ రెండు విభిన్నమైన పాత్రల్లో కనిపిస్తాడని డ్యూయల్ రోల్ అని కూడా ఇటీవల ఒక టాక్ వినిపించిన విషయం తెలిసిందే. ఆ విషయం పక్కన పెడితే ఈ సినిమాలో రామ్ చరణ్ తేజ్ ఒక ప్రభుత్వ అధికారిగా రాజకీయ నాయకుల మోసల్ని బయటకి తీసే విధానంతో కథ కొనసాగుతుందని సమాచారం. అయితే ఈ సినిమా కథకు తగ్గట్టుగానే దర్శకుడు శంకర్ 'అధికారి' అనే టైటిల్ను ఫిక్స్ చేసే ఆలోచనలో ఉన్నట్లు సమాచారం.

ఇదివరకే కొన్ని రకాల టైటిల్స్ సోషల్ మీడియాలో బాగానే వైరల్ అయ్యాయి. కానీ ఇంతవరకు శంకర్ ఆ విషయంపై ఎలాంటి క్లారిటీ అయితే ఇవ్వలేదు. ఇక వీలైనంత త్వరగా ఈ సినిమా టైటిల్ పై ఒక అఫీషియల్ పోస్టర్ ద్వారా క్లారిటీ ఛాన్స్ ఉన్నట్లుగా తెలుస్తోంది. ఈ సినిమాలో మెయిన్ హీరోయిన్ గా కీయరా అద్వానీ నటిస్తుండగా శ్రీకాంత్ సునీల్ ముఖ్యమైన పాత్రల్లో కనిపించబోతున్నారు. ఇక థమన్ మ్యూజిక్ అందిస్తుండగా దిల్ రాజు భారీ బడ్జెట్ తో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.