Begin typing your search above and press return to search.

#RC-15.. చెర్రీ లుక్ టెస్ట్ ముంబైలోనా?

By:  Tupaki Desk   |   29 July 2021 8:41 AM GMT
#RC-15.. చెర్రీ లుక్ టెస్ట్ ముంబైలోనా?
X
మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్- స్టార్ ఫిలిం మేక‌ర్ శంకర్ కాంబినేష‌న్ లో RC-15 అత్యంత భారీగా తెర‌కెక్కుతున్న సంగ‌తి తెలిసిందే. ఈ సినిమా అధికారిక ప్ర‌క‌ట‌న త‌ర్వాత‌ అంచ‌నాలు స్కైని తాకాయి. ఇందులో చ‌ర‌ణ్ ఐఏఎస్ ట‌ర్న్ డ్ సీఎంగా క‌నిపిస్తార‌ని .. శంక‌ర్ మూవీలో న‌టించాక అత‌డి క్రేజ్ నేష‌న‌ల్ లెవ‌ల్లో రెట్టింపు అవుతంద‌నే క‌థ‌నాలు వేడెక్కిస్తున్నాయి. ఇక శంక‌ర్ స్క్రిప్ట్ సెల‌క్ష‌న్ గురించి చెప్పాల్సిన ప‌నిలేదు. ఆయ‌న ఎలాంటి క‌థాంశాన్ని ఎంచుకున్నా.. యూనివ‌ర్శ‌ల్ గా చూపించ‌డం త‌న ప్ర‌త్యేక‌త‌. అత‌డి పాత్ర‌లు యూనిక్ గా ఉంటూనే వాస్త‌వానికి ద‌గ్గ‌ర‌గా ఉంటాయి. ఇక హీరోల లుక్ విష‌యంలో శంక‌ర్ ఎలివేష‌న్ మ‌రో లెవ‌ల్లో ఉంటుంద‌న‌డంలో ఎలాంటి సందేహం లేదు.

పాత్ర డిమాండ్ ని బ‌ట్టి విభిన్న‌ కోణాల్లో ప్రోజెక్ట్ చేయ‌డానికి శంక‌ర్ వెన‌కాడ‌రు. ర‌జ‌నీకాంత్ .. విక్ర‌మ్.. అర్జున్.. ర‌ఘువ‌రుణ్ లాంటి స్టార్ల‌ను అత‌డు ఎంతో గొప్ప‌గా ఆవిష్క‌రించారు. ఇప్పుడు మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్‌ ని వెండి తెర‌పై అదే తీరుగా ఆవిష్క‌రించ‌నున్నార‌న్న‌ది ఆస‌క్తిక‌రంగా మారింది. ఓ ఐఏఎస్ అధికారి రాజ‌కీయ‌నాయ‌కుడిగా మారితే ఎలా ఉంటుంద‌న్నేది సినిమా లైన్ అని ఇప్ప‌టికే రివీల్ అయింది. ఇందులో చెర్రీ క్యారెక్ట‌రైజేష‌న్ డిజైన్ పై ఉత్కంఠ అంత‌కంత‌కు పెరుగోతంది.

ప్ర‌స్తుతం చెర్రీ లుక్ పై సీరియ‌స్ గా వ‌ర్క్ చేస్తున్న‌ట్లు తెలిసింది. చ‌ర‌ణ్ పై మాసివ్ గా లుక్ టెస్ట్ చేస్తున్నార‌ని స‌మాచారం. మునుపెన్న‌డు చూడ‌ని స‌రికొత్త చ‌ర‌ణ్ ని వెండి తెర‌పై చూస్తామ‌నే ప్ర‌చారం జోరుగా సాగుతోంది. ప్ర‌స్తుతం చ‌ర‌ణ్ `ఆర్.ఆర్.ఆర్` పాట‌ల చిత్రీక‌ర‌ణ‌లో బిజీగా ఉన్నారు. అలాగే `ఆచార్య` సినిమాలో కీల‌క పాత్ర‌లో న‌టించారు. ఈ నేప‌థ్యంలో రెండు సినిమా షూటింగ్ ల‌తో బిజీగా ఉన్నారు. ఆచార్య నిర్మాత‌గా చిరు విష‌యంలో చ‌ర‌ణ్ ఎంతో కేర్ తీస్కుంటున్నారు. ఈ ప్రాజెక్టులు పూర్త‌యిన త‌ర్వాత చ‌ర‌ణ్ పూర్తిగా శంక‌ర్ తో చిత్రీక‌ర‌ణ‌కు వెళ్ల‌నున్న‌ట్లు తెలుస్తోంది. ఈలోగానే చ‌ర‌ణ్ లుక్ పై టెస్ట్ షూట్ కి ప్లాన్ చేస్తున్నార‌ట‌. అయితే ఈ ఫోటోషూట్ హైద‌రాబాద్ లో నిర్వ‌హిస్తారా? లేక చెన్నై ..ముంబైలోనా.. అన్న‌ది చూడాలి.