Begin typing your search above and press return to search.

బరిలో దిగడానికి రెడీ అవుతున్న పుష్పరాజ్..!

By:  Tupaki Desk   |   19 Jun 2021 11:30 AM GMT
బరిలో దిగడానికి రెడీ అవుతున్న పుష్పరాజ్..!
X
అల్లు అర్జున్ - డైరెక్టర్ సుకుమార్ కలిసి చేస్తున్న ఫస్ట్ పాన్ ఇండియా మూవీ ''ఆర్.ఆర్.ఆర్''. ఎర్ర చందనం స్మగ్లింగ్‌ నేపథ్యంలో రూపొందుతున్న ఈ చిత్రాన్ని రెండు భాగాలుగా విడుదల చేయనున్నారు. ఇప్పటికే తొలి భాగానికి సంబంధించిన మెజారిటీ షూటింగ్ పూర్తయింది. అలానే సెకండ్ పార్ట్ కోసం 10 శాతం చిత్రీకరణ చేశారు. కరోనా సెకండ్ వేవ్ పరిస్థితులు రాకపోయుంటే ఈపాటికే షూటింగ్ కంప్లీట్ అయ్యేది.

ఇప్పుడు కరోనా తగ్గుముఖం పట్టడం.. లాక్ డౌన్ నిబంధనలు సడలించిన నేపథ్యంలో 'పుష్ప' సినిమా షూటింగ్ తిరిగి ప్రారంభించడానికి చిత్ర బృందం రెడీ అవుతున్నారు. జూలై ఫస్ట్ వీక్ నుంచి హైదరాబాద్ లో చిత్రీకరణ స్టార్ట్ చేయనున్నారని సమాచారం. అయితే షెడ్యూల్స్ కుదించుకోవాలని టాలీవుడ్ పెద్దలు సూచించడంతో.. 'పుష్ప 1' పెండింగ్ వర్క్ ఒకే షెడ్యూల్ లో ముగించాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారట. ఇందులో హీరోయిన్ రష్మిక మందన్నా - విలన్ ఫహాద్ ఫాజిల్ తో పాటుగా మిగతా ప్రధాన తారాగణం పాల్గొననున్నారు.

ఇక 'పుష్ప' మొదటి భాగం విడుదలపై ఇంకా క్లారిటీ రానప్పటికీ.. ఈ ఏడాదిలోనే ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం ఉందని టాక్ నడుస్తోంది. సాదారణ పరిస్థితులు నెలకొంటున్నాయి కాబట్టి త్వరలోనే దీనిపై స్పష్టత రానుంది. పార్ట్ 2 మాత్రం బన్నీ 'ఐకాన్' సినిమా పూర్తి చేసిన తర్వాతే ప్రారంభం కానుంది. 'పుష్ప' సినిమా బన్నీ కెరీర్ లోనే అత్యధిక బడ్జెట్ తో తెరకెక్కుతోంది. ఇందులో ఆయన లారీ డ్రైవర్ గా కనిపించనున్నాడు. చిత్తూరు యాసలో మాట్లాడుతూ ఊర మాస్ లుక్ లో అల్లు అర్జున్ అలరించనున్నాడు.