Begin typing your search above and press return to search.

పుష్ప స్టైల్.. ఆఖరికి అలాన్ వాకర్ కూడా..

By:  Tupaki Desk   |   28 Sep 2022 4:27 AM GMT
పుష్ప స్టైల్.. ఆఖరికి అలాన్ వాకర్ కూడా..
X
స్టైలిష్ స్టార్ నుంచి ఐకాన్ స్టార్ గా అల్లు అర్జున్ ను మార్చేసిన పుష్ప సినిమా క్రియేట్ చేసిన బజ్ అంతా ఇంతా కాదు. ఈ సినిమాకు సంబంధించిన చాలా అంశాలు సోషల్ మీడియా ప్రపంచంలో ఒక సరికొత్త ట్రెండ్ సెట్ చేశాయి. దేశ విదేశాలు దాటి పుష్ప మ్యానరిజమ్స్ ఒక రేంజ్ లో వైరల్ అవుతున్నాయి. సెలబ్రిటీలు కూడా చాలావరకు తగ్గేదే లే స్టైల్ ఫాలో అవుతుండడం విశేషం. ఇక ఫాన్స్ అయితే ఏబరు పుష్ప స్టైల్ ను ఫాలో అయినా కూడా సోషల్ మీడియాలో హడావిడి కూడా చేస్తున్నారు.

ఇక ప్రపంచంలో ఇటీవల కాలంలో అత్యధిక స్థాయిలో క్రేజ్ అందుకున్న ఫాడెడ్ ఫేమ్ నార్వేజియన్ DJ 'అలాన్ వాకర్' కూడా పుష్ప స్టైల్ ను ఫాలో కావడం విశేషం. రీసెంట్ గా అతను అహ్మదాబాద్ లోని ఒక ఇక మ్యూజిజకల్ ఈవెంట్ లో పాల్గొన్నాడు. అక్కడ అతను నిర్వాహకులతో చాలా ఫ్రెండ్లీగా కొనసాగాడు. ఇక దేశవ్యాప్తంగా వైరల్ అయినటువంటి తగ్గేదే లే డైలాగ్ స్టైల్ ను యధావిధిగా చూపించడం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

విదేశాల్లోనే చాలామంది క్రికెటర్లు అలాగే కొంతమంది సినిమా సెలబ్రిటీలు టెక్నీషియన్స్ లు ఇదివరకే పుష్ప స్టైల్ ను ఫాలో అయ్యారు. ఇక ఇప్పుడు ఆఖరికి ప్రపంచంలో ప్రస్తుతం భారీ స్థాయిలో క్రేజ్ అందుకుంటున్న అలాన్ వాకర్ కూడా అల్లు అర్జున్ స్టైల్ ను ఇమిటెడ్ చేయడం వైరల్ గా మారింది. నేటిజన్స్ ఈ వీడియోపై పాజిటివ్ గా కామెంట్ చేస్తున్నారు.

ఇక పుష్ప ఫస్ట్ భారీ స్థాయిలో సక్సెస్ కావడంతో సెకండ్ పార్ట్ అంతకుమించి అనేలా తెరపైకి తీసుకురావాలి అని దర్శకుడు సుకుమార్ పక్క ప్రణాళికతో సిద్ధమవుతున్నాడు. ఫస్ట్ పార్ట్ కంటే సెకండ్ పార్ట్ లో అల్లు అర్జున్ స్టైల్ కూడా కొంతగా మారుతుందట.

బాడీ లాంగ్వేజ్ లో కూడా కాస్త తేడాలు ఉంటాయని తెలుస్తోంది. ముఖ్యంగా అతని ఫేస్ లో కూడా కొన్ని మార్పులు తెస్తున్నట్లు సమాచారం. అలాగే సరికొత్త డైలాగ్స్ కూడా ఇంతకంటే హై లెవెల్ లోనే బజ్ క్రియేట్ చేయాలి అని జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. మరి సెకండ్ పార్ట్ ఎలాంటి ఫలితాన్ని అందుకుంటుందో చూడాలి.

నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.