Begin typing your search above and press return to search.

అక్టోబ‌ర్ నుంచి పుష్ప షూటింగ్ షెడ్యూల్

By:  Tupaki Desk   |   17 Sep 2020 5:00 PM GMT
అక్టోబ‌ర్ నుంచి పుష్ప షూటింగ్ షెడ్యూల్
X
కుంటాల జ‌ల‌పాతం విజిట్ తో బ‌న్ని ఒక్క‌సారిగా హాట్ టాపిక్ అయ్యాడు. అనుమ‌తి లేని చోట విజిట్ కి ఎలా వెళ్లారు? అంటూ స్వ‌చ్ఛంద సంస్థ హ‌డావుడి చేయ‌డంతో అది కాస్తా అభిమానుల్ని కంగారు పెట్టింది. అయితే బ‌న్ని ఇక్క‌డ షూటింగులో పాల్గొన్నాడ‌ని చెప్పే ఆధారం ఏదీ లేక‌పోయినా అందుకే వెళ్లాడు! అన్న ప్ర‌చారం సాగిపోయింది.

కానీ యూనిట్ నుంచి అందిన తాజా స‌మాచారం ప్ర‌కారం.. అల్లు అర్జున్ పుష్ప షూటింగ్ వ‌చ్చే నెల నుంచి మొద‌లు పెట్ట‌బోతున్నారని తెలిసింది. ముందుగా కొన్ని ఇండోర్ స‌న్నివేశాలు హైద‌రాబాద్ ప‌రిస‌‌రాల్లో చిత్రీక‌రించి ఆ త‌రువాత వైజాగ్ మ‌న్యం ఏరియాలో షూట్ చేయ‌డానికి చిత్ర యూనిట్ ప్లాన్ చేసింది. ఈ సినిమాలో బ‌న్నీ పులితో ఫైట్ చేయ‌బోతున్నార‌ట‌. దీనికి సంబంధించిన షూటింగ్ వియ‌త్నామ్ లో చేయ‌డానికి సుక్కు భాయ్ ప్లాన్ చేస్తున్నార‌ని తెలిసింది.

పుష్ప‌లో బ‌న్ని డ్యూయల్ షేడ్ లో క‌నిపించ‌బోతున్నార‌ని ఇందులో మాస్ రోల్ తో పాటు క్లాస్ బిజినెస్ మేన్ లుక్ తో స‌ర్ ప్రైజ్ ట్రీటిస్తాడ‌ని ర‌క‌ర‌కాలుగా ప్ర‌చారం సాగుతోంది. కాకులు దూర‌ని కార‌డ‌వుల్లో కొండ కోన‌ల్లో జ‌ల‌పాతాల న‌డుమ సుక్కూ షెడ్యూల్స్ ప్లాన్ చేస్తుండ‌డంతో తెలుగు తెర‌పై స‌రికొత్త విజువ‌ల్స్ ఆవిష్కృత‌మ‌వుతాయ‌నే భావిస్తున్నారు. రొటీనిటికీ భిన్నంగా చిత్తూరు యాస‌తో బ‌న్ని ఎలాంటి మ్యాజిక్ చేస్తాడో చూడాల‌న్న ఆస‌క్తి అభిమానుల్లో ఉంది. ఎర్ర‌చంద‌నం స్మిగ్లింగ్ నేప‌థ్యంలో భారీ యాక్ష‌న్ కి ఆస్కారం ఉన్న చిత్రం పుష్ప‌. ఇక ఇందులో పులితో బ‌న్ని ఫైట్ హైలైట్ గా ఉండ‌నుంద‌న్న వార్తా వేడెక్కిస్తోంది.