పుష్ప (Vs) ఆచార్య! గిరిజన బాలికల వీర ప్రేమ గాధలు!!

Sun Apr 18 2021 23:00:01 GMT+0530 (IST)

Pushpa (Vs) Acharya! Heroic love stories of tribal girls !!

కొండ కోనలు జలపాతాలు పచ్చందాల నడుమ గిరిజన పడుచుల జీవన పయనం సంస్కృతి సంప్రాయం ఎంతో ఆసక్తిగా ఉంటుంది పరిశీలిస్తే. మోసం తెలియని అమాకత్వం గిరిజనుల్లో కనిపిస్తుంది. ప్రపంచీకరణ కార్పొరేటీకరణ మాయలో ఇప్పుడు అన్నిచోట్లా నాగరికత ప్రభావం కనిపిస్తోంది కానీ.. ఇంతకుముందు గిరిజన బాలికలు స్వచ్ఛంగా ఉండేవారు.అదంతా సరే కానీ.. టాలీవుడ్ లో తెరకెక్కుతున్న అడవి నేపథ్యం సినిమాల్లో గిరిజన బాలికల పాత్రలు ఎలా ఉండబోతున్నాయి? అన్నది ఆసక్తికరంగా మారింది. ఇంతకుముందు విరాఠపర్వం ట్రైలర్ లో సాయి పల్లవి విలేజ్ గాళ్ పాత్రలో కనిపించారు.  కొండ కోనలు అడవుల్లో సాగే ఎమోషనల్ లవ్ స్టోరిలో సాయిపల్లవి కాస్త మోడ్రనైజ్డ్ లుక్ లో కనిపించారు.

కానీ అందుకు భిన్నంగా ఆచార్యలో పూజాహెగ్డే.. పుష్పలో రష్మిక మందన కనిపిస్తారని చెబుతున్నారు. పుష్ప టీజర్ లో రష్మిక లుక్ ఓపెనైనా ఆచార్యలో పూజా హెగ్డే లుక్ ఎలా ఉండనుంది అన్నది సర్ ప్రైజ్ గా మారింది. కొండ మల్లి గోండు మల్లి లుక్ లో కనిపిస్తుందా?  లేక ఇంకేదైనా సర్ ప్రైజ్ ఇచ్చే రూపమా? అన్నది సస్పెన్స్ ఇప్పటికి.

ఆచార్యలో పూజా రామ్ చరణ్ తో రొమాన్స్ చేస్తే.. పుష్పలో రష్మిక మందన్న.. బన్నితో రొమాన్స్ చేస్తోంది. మెగా సినిమాల్లో ఆ ఇద్దరు గిరిజన గ్రామీణ యువతుల పాత్రలు ఎలా ఉండనున్నాయి? అన్నది ఆద్యంతం ఉత్కంఠ పెంచుతోంది.