Begin typing your search above and press return to search.

రష్యాలో తగ్గేదేలే.. బన్నీ టీం సందడి వీడియో వైరల్‌

By:  Tupaki Desk   |   7 Dec 2022 5:02 AM GMT
రష్యాలో తగ్గేదేలే.. బన్నీ టీం సందడి వీడియో వైరల్‌
X
అల్లు అర్జున్‌ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో రూపొందిన పుష్ప సినిమా గత ఏడాది డిసెంబర్‌ లో ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెల్సిందే. సరిగ్గా ఏడాదికి అంటే ఈ నెల 8వ తారీకున రష్యాలో స్థానిక భాషలో సినిమాను విడుదల చేయబోతున్నారు. ఇప్పటికే ట్రైలర్‌ విడుదల చేసి అక్కడ సందడి మొదలు పెట్టారు.

చిత్ర యూనిట్‌ సభ్యులు అల్లు అర్జున్‌.. సుకుమార్‌.. రష్మిక మందన్నా.. దేవిశ్రీ ప్రసాద్‌ ఇంకా నిర్మాతలు రష్యాలో ప్రమోషన్ కార్యక్రమాల్లో బిజీగా ఉన్నారు. అక్కడి మీడియాతో మాట్లాడుతూ తమ సినిమాను ప్రమోట్‌ చేసుకునే పనిలో ఉన్నారు.

పెద్ద ఎత్తున రష్యాలో తిరుగుతూ సందడి చేస్తున్న పుష్ప యూనిట్‌ సభ్యులు స్థానికుల్లో సినిమాపై ఆసక్తిని పెంచుతున్నారు. మీడియాలో మంచి కవరేజ్ ను దక్కించుకుటున్నారు. స్థానికంగా రైలు ప్రయాణం చేస్తూ రకరకాలుగా ప్రేక్షకులతో ఇంటరాక్ట్‌ అయ్యేందుకు పుష్ప టీమ్‌ ప్రయత్నాలు చేస్తున్నారు.

అందులో భాగంగానే పుష్ప టీమ్‌ ట్రావెల్‌ వీడియోలు వైరల్‌ అవుతున్నాయి. ఎన్నారై ఫ్యాన్స్ తో పాటు రష్యన్స్ కూడా పుష్ప సినిమాను చూసేందుకు మరియు పుష్ప యూనిట్‌ సభ్యులతో సెల్ఫీలు దిగేందుకు పోటీ పడుతున్నారు. రష్యాలో ఈ సినిమా సక్సెస్ అయితే పుష్ప 2 అంతకు మించి అక్కడ విడుదల చేసే అవకాశాలు ఉన్నాయి.

ఈనెల 8న విడుదల కాబోతున్న రష్యన్ పుష్ప ఎలా ఉంటాడు అనేది అందరిలో ఆసక్తిని రేకెత్తిస్తోంది. చైనా మరియు అమెరికాలో మన సినిమాలు విడుదల అయ్యాయి కానీ రష్యాలో పుష్ప విడుదల కావడం చాలా స్పెషల్‌ అన్నట్లుగా టాక్ వినిపిస్తుంది.
https://youtube.com/shorts/5uV1OPcwKdM?feature=share