#పుష్ప.. బన్ని బర్త్ డే గిఫ్ట్ అదేనా?

Mon Mar 01 2021 19:00:01 GMT+0530 (IST)

Pushpa Team Birthday Gift For Allu Arjun

ఏప్రిల్ 8 బన్ని బర్త్ డే. ఆరోజు ప్రపంచవ్యాప్తంగా ఉన్న తన అభిమానులకు స్టైలిష్ స్టార్ ఎలాంటి కానుక ఇస్తున్నాడు? ఈ ప్రశ్నకు సమాధానం కోసం ఫ్యాన్స్ వెయిటింగ్.తాజా సమాచారం మేరకు అల్లు అర్జున్ పుట్టిన రోజు సందర్భంగా  పుష్ప టీజర్ విడుదల కానుందని సమాచారం. ఇక ఈ టీజర్ ఆద్యంతం బన్ని మాస్ లుక్ తో రూత్ లెస్ గా క్రూరుడిగా ఊహించని షాకిస్తాడన్న లీకులు అందాయి.

అసలు పుష్ప లో బన్ని పాత్ర ఎలా ఉంటుంది? అన్నదానికి టీజర్ తోనే ఇంట్రో ఇవ్వనున్నారు. పోస్టర్ లో కొంత చూపించినా టీజర్ పూర్తి స్థాయి ట్రీటిస్తుందట. ఇప్పటివరుకు సుకుమార్ తీసిన సినిమాల్లో బన్నీ క్యారెక్టర్ కి కొంత నెగిటివ్ టచ్ కనిపిస్తుంది. ఆర్య- ఆర్య 2 లో బన్నీ యాటిట్యూట్ నెగిటివ్ ఉండటంతో పాటు హీరోగా కూడా కనిపిస్తూ ఉంటాడు. ఇప్పుడు పుష్పలో కూడా బన్నీ పాత్రకి నెగిటివ్ షేడ్స్ ఉన్నాయని సమాచారం. రూత్ లెస్ గా పూర్తి ఈగోతో నిండిన ఓ లారీ డ్రైవర్ కమ్ స్మగ్లర్ గా బన్నీ కనిపించబోతున్నాడని సమాచారం.

స్మగ్లర్ ని వెంటాడే పోలీసాఫీసర్ కి చుక్కలు చూపించే విధంగా ఆ క్యారెక్టర్ ని డిజైన్ చేశారట. అయితే ఆ స్మగ్లర్ లో పాజిటివ్ యాంగిల్ ఉంటుందా .. ఉందడా? అన్నది మాత్రం టీజర్ లో రివీల్ కాదట. ఆ సస్పెన్స్ ఎలిమెంట్ ఏమిటన్నది సినిమా రిలీజయ్యాకే తెలుస్తుందని గుసగుసలు వినిపిస్తున్నాయి.

పుష్ప చిత్రంలో రష్మిక మందన్న కథానాయిక. దేవీశ్రీ సంగీతం అందిస్తున్నారు. ఇందులోనూ రింగ రింగ రేంజు ఐటెమ్ నంబర్ ని దేవీ రెడీ చేసానని ఇంతకుముందు వెల్లడించారు. మైత్రి మూవీ మేకర్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది.