యూట్యూబ్లో 'పుష్ప' విశ్వరూపం..!

Tue Dec 06 2022 23:00:01 GMT+0530 (India Standard Time)

Pushpa Songs Trending in Youtube

క్రియేటివ్ దర్శకుడు సుకుమార్.. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కాంబినేషన్లో తెరకెక్కిన మూవీ 'పుష్ప'. 2021లో విడుదలైన ఈ మూవీని బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల సునామీ సృష్టించింది. దక్షిణాదితోపాటు బాలీవుడ్లోనూ సత్తా చాటి బాక్సాఫీస్ వద్ద తెలుగు సినిమా సత్తా ఏంటో మరోసారి నిరూపించింది పుష్ప. ఇక ఈ సినిమాలో అల్లు అర్జున్ తన నట విశ్వరూపాన్ని ప్రదర్శించాడు.అల్లు అర్జున్ ఫుల్ మాస్ గా కన్పించి అభిమానులను ఫిదా చేశారు. ఈ సినిమాలో రష్మిక మందన డీగ్లామర్ లోనూ కన్పించినా పాటల్లో మాత్రం గ్లామర్ హద్దులను చేరిపివేసింది. సమంత ఐటమ్ సాంగ్ సినిమాకే హైలెట్ గా నిలిచింది. దేవీశ్రీ బాణీలు.. సుక్కు డైరెక్షన్ ప్రతీది సినిమాకు ప్లస్ కావడంతో సినిమా అన్ని భాషల్లోనూ సూపర్ హిట్టుగా నిలిచింది.

2021 ఏడాది చివర్లో విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ బోనంజాగా నిలిచింది. ఈ మూవీ సూపర్ హిట్టుగా కావడంతో అల్లు అర్జున్ ఓవర్ నైట్లో ప్యాన్ ఇండియా స్టార్ గా మారిపోయాయి. ఇక ఈ మూవీలోని పలు సాంగ్స్ యూట్యూబ్ ను షేక్ చేసింది. అయితే ఈ సినిమా ఆల్బమ్ విడుదలైన సమయంలో దేవిశ్రీ ప్రసాద్ సాధారణ మ్యూజిక్ ఇచ్చాడంటూ ట్రోలింగ్ గురయ్యాడు.

అయితే కాలం గడిచే కొద్ది 'శ్రీవల్లి'.. 'సామీ.. సామీ..'.. 'ఊ అంటావా మావ.. ఊఊ అంటావా మావ' అనే సాంగ్స్ దేశ వ్యాప్తంగా వైరల్ గా మారాయి. దీంతో ఈ సినిమాలోని పాటలు దేశవ్యాప్తంగా ఆల్ టైమ్ బెస్ట్ గా నిలిచాయి. 2022 ఏ ఇయర్ ఆన్ యూట్యూబ్' వార్షిక భారతీయ జాబితాలో వీడియో స్ట్రీమింగ్ సైట్లో బాగా పనిచేసిన పది ఉత్తమ మ్యూజిక్ వీడియోలలో 'పుష్ప' అనేక స్లాట్ లను సొంతం చేసుకుంది.

పుష్ప హిందీ వెర్షన్ పాటలకు అత్యధిక వీక్షణలు వచ్చాయి. 'శ్రీవల్లి' పాటకు 544 మిలియన్ల వ్యూస్ తొలి ప్లేస్ సొంతం చేసుకోగా.. 'సామి సామి' పాటకు 490 మిలియన్ల వ్యూస్ తో మూడో స్థానంలో నిలిచింది. అలాగే 'ఊ అంటావా'' హిందీ వెర్షన్ 344 మిలియన్ వ్యూస్తో ఆరో స్థానంలో నిలిచింది. ఇదే పాట తెలుగు వెర్షన్ 7 స్థానంలో.. పసూరి సాంగ్ 8 వ స్థానంలో నిలిచాయి.

అరబిక్ కుతు లిరికల్ వీడియో రెండో స్థానంలో.. కచా బాదం నాలుగో స్థానంలో..అరబిక్ కుతు వీడియో సాంగ్ తొమ్మిదో స్థానంలో నిలిచాయి. అయితే ఈ జాబితాలో ఒక్క బాలీవుడ్ సినిమాకు చెందిన సాంగ్ కూడా లేకపోవడం గమనార్హం. ఈ పరిణామం నిజంగా బాలీవుడ్ ఇండస్ట్రీకి గట్టి షాకనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.