Begin typing your search above and press return to search.

పుష్ప రాజ్ షూటింగ్.. ఎంతవరకు వచ్చిందంటే..

By:  Tupaki Desk   |   28 Jan 2023 5:00 PM GMT
పుష్ప రాజ్ షూటింగ్.. ఎంతవరకు వచ్చిందంటే..
X
పుష్ప.. పుష్ప రాజ్.. తెలుగు సినీ ప్రేక్షకులను ఎంతగానో అలరించాడు. పాన్ ఇండియా చిత్రంగా తెరకెక్కిన ఈ సినిమా బాక్సాఫీసును బద్ధలు చేసింది. అల్లు అర్జున్, రష్మిక మందన్న హీరోహీరోయిన్లుగా సుకుమార్ తెరకెక్కింకించిన ఈ సినిమా.. నార్త్, సౌత్ అనే తేడా లేకుండా దేశ వ్యాప్తంగా సంచలన విజయాన్ని అందుకుంది. తగ్గేదే లే డైలాగ్ తో పాటు రారా సామి పాట విపరీతమైన క్రేజ్ ను అందుకుంది. దీనికి సీక్వెల్ అయిన్ పుష్ప-2 షూటింగ్ కూడా ఇప్పటికే ప్రారంభమైన విషయం అందరికీ తెలిసిందే.

అయితే పుష్ప-2 లో కూడా అల్లు అర్జున్, రష్మికా మందన్నాలు హీరోహీరోయిన్లుగా నటిస్తున్నారు. కొన్ని రోజుల క్రితమే ఫస్ట్ షెడ్యూల్ లో భాగంగా ఐదు రోజులు చిత్రీకరణ చేశారు. ఇప్పుడు లిష్ స్టార్.. పుష్ప ది రూల్ లో రెండో షెడ్యూల్ షూటింగ్ లో పాల్గొంటున్నారు.

ఇందులో భాగంగానే చిత్రబృందం అంతా విశాఖలో ఉన్నారు. అల్లు అర్జున్ తో పాటు ఇతర తారాగణంపై కీలక సన్నివేశాలు తెరకెక్కిస్తున్నారు. ఈ క్రమంలోనే ఈరోజు అల్లు అర్జున్ సినిమాలో వచ్చే హీరో ఇంట్రడక్షన్ సాంగ్ ను చిత్రీకరిస్తున్నారు.

ప్రస్తుతం అల్లు అర్జున్ ఆ పాట కోసం కష్టపడుతున్నారు. హే బిడ్డా.. ఇది నా అడ్డాలా అంటూ పుష్ప 1లో వచ్చిన పుష్పరాజ్.. ఈ సారి కూడా మాంచి పాటతోనే ఎంట్రీ ఇవ్వబోతున్నారట.

అయితే ఫిబ్రవరిలో హీరోయిన్ రష్మికకు సంబంధించిన షూటింగ్ కూడా ప్రారంభం అవుతున్నట్లు తెలుస్తోంది. పుష్ప కంటే పుష్ప 2 మరింత బాగుంటుందని చాలా మంది భావిస్తున్నారు. సాంగ్స్, డైలాగ్స్ తో సుకుమార్ మరోసారి సూపర్ డూపర్ హిట్టు కొడతారని అంచనా వేస్తున్నారు.

పుష్ప సినిమాకు వచ్చిన క్రేజ్ దృష్టిలో ఉంచుకొని పుష్ప 2 విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటుందట చిత్రబృందం. కేవలం ఇండియాలోనే కాకుండా ఇంటర్నేషనల్ మార్కెట్ ను కూడా దృష్టిలో పెట్టుకొని 2024 వేసవిలో సినిమాను విడుదల చేయాలని భావిస్తోందట. రష్యాలో కూడా పుష్ప2 ను విడుదల చేసేందుకు చిత్రబృందం ఏర్పాట్లు చేస్తోంది. మరి ఈ సినిమా ఏ రేంజ్ లో హిట్టై ఎంత మేర కలెక్షన్లు వసూలు చేస్తుందో చూడాలి.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.