‘పుష్ప’రాజ్ గెటప్స్ మామూలుగా లేవుగా..!

Sun Feb 28 2021 10:05:19 GMT+0530 (IST)

'Pushpa' Raj Getups are not as usual ..!

అల్లు అర్జున్ - సుకుమార్ కాంబోలో రాబోతున్న ‘పుష్ప’.. ఏదో విధంగా తరచూ వార్తల్లో నిలుస్తోంది. ఆ విధంగా సినిమాకు మంచి ప్రమోషన్ లభిస్తోంది. ఆంధ్రప్రదేశ్ లోని మారేడు మిల్లి అటవీ ప్రాంతాల్లో షూటింగ్ జరిగనన్ని రోజులూ అక్కడి స్థానికులను బన్నీ కలుసుకున్నాడు. ఆ తర్వాత షూటింగ్ ముగించుకొని వెళ్తుండగా ఖమ్మం జిల్లాలోనూ ఫ్యాన్స్ తో ముచ్చటించాడు. ఆ ఫొటోలు వైరల్ అయ్యాయి.ఇప్పుడు తమిళనాడులోని తెన్కాసిలో పుష్ప షూటింగ్ జరుగుతోంది. అక్కడి నుంచి లేటెస్ట్ ఫొటో ఒకటి రిలీజ్ అయ్యింది. ఈ పిక్ లో బన్నీ స్టైలిష్ స్టార్ గా కనిపిస్తుండడం గమనార్హం. ఇప్పటి వరకూ రిలీజ్ అయిన అల్లు అర్జున్ చిత్రాలు అచ్చమైన స్మగ్లర్ గా మొరటు వ్యక్తిగా కనిపించాయి. కానీ.. ఈ ఫొటోలో లేటెస్ట్ లుక్ లో అదరగొడుతున్నాడు.

ఈ ఫొటోలో ఓ అభిమానితో ముచ్చటిస్తున్నాడు బన్నీ. స్టైలిష్ స్టార్ ను షూటింగ్ స్పాట్ లో కలిసినప్పుడు తీసిన ఫొటో ఇది అని ఆ ఫ్యాన్ సోషల్ మీడియాలో షేర్ చేశాడు. ఈ సందర్భంగా ఓ సాధారణ వ్యక్తిలాగే తనతో బిహేవ్ చేశాడని ఇది చాలా గొప్ప విషయమని సదరు అభిమాని పేర్కొన్నాడు.

కాగా.. బన్నీ కెరీర్లోనే తొలి పాన్ ఇండియా మూవీ అయిన పుష్ప.. దాదాపు 170 కోట్ల భారీ బడ్జెట్ తో రూపొందుతోంది. మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ సినిమాను.. ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నాడు సుకుమార్. ఆగస్టులో ఈ చిత్రాన్ని రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు మేకర్స్.