#పుష్ప.. మంగ్లీ జానపదం జాతీయ స్థాయిలో ఊపుతుందా?

Sun Oct 24 2021 10:59:08 GMT+0530 (IST)

Pushpa Movie latest Update

స్టైలిష్ స్టార్  అల్లు అర్జున్ కథానాయకుడిగా సుకుమార్ దర్శకత్వంలో పాన్ ఇండియా చిత్రం `పుష్ప` రెండు భాగాలుగా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. మొదటి భాగాన్ని `పుష్ఫ- ది రైజింగ్`గా ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. ప్రస్తుతం ద్వితీయార్థం సన్నివేశాలకు సంబంధించిన షూటింగ్ జరుగుతోంది. అలాగే మొదటి భాగం రిలీజ్ నేపథ్యంలో ప్రచారం పనులు ఊపందుకున్నాయి. ఇప్పటికే  రెండు సింగిల్స్ రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే. `దాక్కో దాక్కో మేక` అంటూ సాగే మాస్ సాంగ్ కి శ్రోతల నుంచి మంచి ఆదరణ లభించింది. సాంగ్ లోనే బన్నీరగ్గడ్ లుక్ ని హైలైట్ చేసారు. ఈ పాటని ఒక్కో భాషలో ఒక్కో సింగర్ ఆలపించారు.తెలుగులో శివమ్.. హిందీ.. కన్నడం..మలయాళం..తమిళ్ లో  విశాల్ దద్లానీ.. విజయ్ ప్రకాష్.. రాహుల్ నంబీయర్.. బెన్నీ గాత్రం అందించారు.  అటుపై రెండవ సింగిల్ `శ్రీవల్లి` అంటూ సాగే పాటను రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే. ఈ పాటని తమిళ్..తెలుగు..మలయాళం వెర్షన్లకు సిధ్ శ్రీరామ్ గాత్రం అందించగా..హిందీ వెర్షన్ లో జావెద్ అలీ ఆలపించారు. ఈ రెండు పాటలకు శ్రోతల నుంచి విశేష ఆదరణ లభించింది. తాజాగా యూనిట్ మూడవ పాటని కూడా రిలీజ్ చేయడానికి రెడీ అవుతోంది. అయితే ఈ పాట సినిమాకి సమ్ థింగ్ స్పెషల్ గా ఉంటుందని తెలుస్తోంది.

పాట పూర్తిగా జానపద బాణీతో అలరిస్తుందని సమాచారం. టాలీవుడ్  ఫేమస్  సింగర మంగ్లీ ఈ పాటను ఆలపిస్తారని తెలుస్తోంది.  జానపద నేపథ్యం ఉన్న పాటలు పాడటంలో మంగ్లీ  ఫేమస్. మంగ్లీ వాయిస్ ఈ పాటకు పర్పెక్ట్ గా సూటయిందని అంటున్నారు. దేవి శ్రీ ప్రసాద్ చక్కని ట్యూన్ సమకూర్చినట్లు తెలుస్తోంది. ఈ పాట ఎప్పుడు రిలీజ్ అవుతుందన్నది త్వరలోనే అధికారికంగా ప్రకటించనున్నారరట. ఇందులో బన్నీకి జోడీగా రష్మిక మందన నటిస్తోంది. మైత్రీ మూవీ మేకర్స్ భారీ బడ్జెట్ తో చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

తీన్మార్ మంగ్లీకి ఎందుకంత క్రేజు?

జానపద గాయనీగాయకులు ఎందరు ఉన్నా మంగ్లీ వేరు అని ప్రూవైంది. మంగ్లీ టాలీవుడ్ లో తనదైన ప్రత్యేకతతో పాపులరైంది. తీన్మార్ టీవీ కార్యక్రమంతో ఎంతో పాపులారిటీ తెచ్చుకున్న మంగ్లీ పలు టీవీ కార్యక్రమాలతో అలరించారు. నేపథ్య గాయనిగా మంగ్లీ దూసుకుపోతోంది. ఇప్పటికే అల వైకుంఠపురములో చార్ట్ బస్టర్ సాంగ్ రాములో రాముల కు గొప్ప ప్రశంసలు అందుకుంది. అలాగే శైలజా రెడ్డి అల్లుడు సినిమాలో టైటిల్ పాడాను పాడి మంచి క్రేజ్ ను సొంతం చేసుకుంది. ఇటీవల దాదాపు డజను సినిమాలకు పాడుతూ కెరీర్ పరంగా బిజీ బిజీగా ఉంది. ఇప్పుడు పుష్ప లాంటి పాన్ ఇండియా చిత్రానికి పాడుతూ జాతీయ స్థాయిలో పాపులారిటీ దక్కించుకోనుంది.

మంగ్లీ గాయనిగానే కాదు నటిగాను అవకాశాలు అందుకుంటోంది. ఇప్పటికే కన్నడలో శివరాజ్ కుమార్ చిత్రంలో నటిస్తోందని... తెలుగులోనూ పలువురు కీలక పాత్రల్లో నటించేందుకు ఆఫర్లు ఇచ్చారని తెలిసింది. తొలిగా నితిన్ హీరోగా నటిస్తున్న మాస్ట్రోలో మంగ్లీ నటించింది. టాలీవుడ్ లో అరుదైన గాయనిగా నటిగా ఆల్ రౌండర్ నైపుణ్యంతో దూసుకుపోతున్న ఈ తెలుగమ్మాయికి ఇరుగు పొరుగు పరిశ్రమల నుంచి వేగంగా అవకాశాలు రావడం ఇటీవల చర్చనీయాంశంగా మారింది. మంగ్లీ మరో స్థాయిని చేరుకుంటుందనే అంచనా వేస్తున్నారు అభిమానులు.