Begin typing your search above and press return to search.

'పుష్పా' కాస్టింగ్‌ ప్లానింగ్‌ అంతా తారుమారు

By:  Tupaki Desk   |   5 July 2020 9:45 AM GMT
పుష్పా కాస్టింగ్‌ ప్లానింగ్‌ అంతా తారుమారు
X
అల్లు అర్జున్‌ సుకుమార్‌ ల కాంబినేషన్‌ లో పుష్పా చిత్రంను గత ఏడాదే ఫైనల్‌ చేశారు. కాని బన్నీ అల వైకుంఠపురంలో చిత్రం పూర్తి అయిన తర్వాత మొదలు పెట్టాలనుకున్నారు. అల వైకుంఠపురంలో సూపర్‌ హిట్‌ అవ్వడంతో ఆ సక్సెస్‌ ను బన్నీ ఎంజాయ్‌ చేసిన క్రమంలో మరో రెండు నెలలు షూటింగ్‌ వాయిదా వేశారు. షూటింగ్‌ కు వెళ్లాలని భావిస్తున్న సమయంలో మహమ్మారి కరోనా కారణంగా ఎప్పుడు ప్రారంభించేది తెలియని పరిస్థితి ఉంది.

పుష్ప చిత్రం అనుకున్న సమయంలో కీలక పాత్రకు గాను విజయ్‌ సేతుపతిని అనుకున్నారు. ఆయనతో పాటు మరికొందరు నటీనటులను కూడా ఎంపిక చేశారు. కాని షూటింగ్‌ ఆలస్యం అవ్వడంతో డేట్లు కుదరడం లేదు అంటూ కొందరు తప్పుకుంటున్నారు. విజయ్‌ సేతుపతి ఇతర కమిట్‌ మెంట్స్‌ ఉన్న కారణంగా పుష్పా సినిమాను వదిలేసినట్లుగా టాక్‌ వినిపిస్తుంది.

ముఖ్య పాత్రలకు ఎంపిక చేసిన వారిలో కొందరు తప్పుకోవడం లేదంటే డేట్లు కుదరక పోవడం వంటి కారణాల వల్ల కాస్టింగ్‌ ప్లానింగ్‌ అంతా కూడా గందరగోళంగా ఉంది. ఈ చిత్రంలో విలన్‌ పాత్రకు గాను బాలీవుడ్‌ స్టార్‌ నటుడిని సంప్రదించగా ఆయన ఓకే చెప్పాడని అయితే ఎప్పుడు డేట్లు కావాలో సుకుమార్‌ చెప్పని కారణంగా ఆయన కూడా తన నిర్ణయాన్ని మళ్లీ మార్చుకున్నాడనే పుకార్లు వినిపిస్తున్నాయి. ప్రస్తుతానికి పుష్పలో హీరోగా అల్లు అర్జున్‌ హీరోయిన్‌ గా రష్మిక మందన్న తప్ప ముఖ్య పాత్రలకు సంబంధించి ఎవరిని కన్ఫర్మ్‌ చేయలేదు.