ఉత్తరాది ప్రేక్షకులకు బన్నీ మరో సర్‌ప్రైజ్

Mon Jan 17 2022 12:25:46 GMT+0530 (IST)

Pushpa Craze .. Bunny into another movie track

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన చిత్రం `పుష్ప ది రైజ్`. సుకుమార్ తెరకెక్కించిన ఈ మూవీ ఇటీవల విడుదలై సంచలన విజయాన్ని సాధిస్తోంది. తెలుగు తో పాటు ఐదు బాషల్లో విడుదలైన ఈ మూవీ ఊహించని విధంగా వసూళ్ల వర్షం కురిపిస్తూ సరికొత్త రికార్డులు సృష్టిస్తోంది. దీంతో బన్నీ టాక్ ఆఫ్ ది ఇండియాగా మారిపోయాడు. అంతే కాకుండా బన్నీ నటించిన ఈ మూవీ ఉత్తరాదిలో రికార్డు స్థాయి వసూళ్లని రాబడుతూ ట్రేడ్ వర్గాలతో పాటు మేకర్స్‌ని కూడా విస్మయానికి గురిచేస్తోంది.ఏకంగా 80 కోట్ల మార్కుని `పుష్ప` హిందీ వెర్షన్ క్రాస్ చేయడం ఇప్పుడు ఇండస్ట్రీ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. బన్నీపై తెలుగు తమిళ మలయాళ కన్నడ ప్రేక్షకుల్లోనే క్రేజ్ వుందని భావించిన మేకర్స్ `పుష్ప` హిందీ వెర్షన్ పై అంతగా హోప్ పెట్టుకోలేదు. ఆ కారణంగానే ఈ మూవీని ఉత్తరాదిలో పెద్దగా ప్రమోట్ కూడా చేయలేదు. అయితే రీసెంట్ గా విడుదలైన ఈ మూవీ ఉత్తరాదిలో ఊహించని స్థాయిలో వసూళ్లని రాబడుతుండటం అక్కడి ప్రేక్షకులు బన్నీ చిత్రానికి బ్రహ్మ రథం పడుతున్న నేపథ్యంలో వారికి మరో సర్ ప్రైజ్ ఇవ్వడానికి బన్నీ రెడీ అయిపోయాడు.

రెండేళ్ల క్రితం బన్నీ హీరోగా మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ తెరకెక్కించగా సంక్రాంతికి విడుదలైన చిత్రం `అల వైకుంఠపురములో`. మ్యూజికల్ హిట్ గా నిలవడమే కాకుండా బన్నీ కెరీర్‌లో తొలి ఇండస్ట్రీ  హిట్ గా నిలిచింది. వసూళ్ల పరంగా నాన్ బాహుబలి రికార్డుల్ని సృష్టించిన విస్మయానికి గురిచేసింది. ఇప్పడుకు `పుష్ప` బాలీవుడ్ ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్న నేపథ్యంలో `అల వైకుంఠపురములో` మూవీని హిందీ ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నారు.

జనవరి 26న ఈ మూవీ హిందీ వెర్షన్ ని రిలీజ్ చేయబోతున్నారు. తాజాగా సోమవారం జనవరి 18న బాలీవుడ్ క్రిటిక్ తరణ్ ఆదర్శ్ ఈ విషయాన్ని వెల్లడిస్తూ ఓ పోస్టర్ ని ట్వీట్ చేశారు. `పుష్ప`తో చారిత్రాత్మక విజయాన్ని అందుతున్న బన్నీ నుంచి వస్తున్న మరో చిత్రం `అల వైకుంఠపురములో`. ఈ మూవీ మిందీ వెర్షన్ ని ఈ నెల 26న దేశ వ్యాప్తంగా థియేటర్లలో విడుదల చేస్తున్నారు` అని ఆయన వెల్లడించారు. `పుష్ప` క్రేజ్ `అల వైకుంఠపురములో` చిత్రానికి ఎంత వరకు ప్లస్ అవుతుందో తెలియాలంటే ఈ నెల 26 వరకు వేచయి చూడాల్సిందే.