గోవాలో తిష్ట వేసిన పూరి?

Mon Sep 26 2022 19:00:01 GMT+0530 (India Standard Time)

PuriJagannadh At Goa Beach For New Story

పూరి జగన్నాధ్ అండ్ కోని 'లైగర్' ఏ రేంజ్ లో దెబ్బ కొట్టిందో చెప్పాల్సిన పనిలేదు. ఒక్క పరాజయం టీమ్ అంర్నీ ఉక్కిరిబిక్కిరి చేసేసింది. ముంబైలో ప్లాట్ ని ఉన్న పళంగా ఖాళీ చేసి మకాం హైదరాబాద్ కి మార్చేసారు.నెల నెలా లక్షల రపాయలు అద్ద చెల్లించాలంటే?  చుక్కలు కనిపించడంతో పూరి దిగిరాక తప్పదు. ఉన్న పళంగా డ్రీమ్ ప్రాజెక్ట్ జనగణమని ఆపేసి ఎక్కడిక్కడ సెటిల్ చేసి రిలాక్స్ అవుతున్నాడు.

ఇలాంటివి ఆయనకు కొంతేం కాదు. ఎన్నో ఒడిదుడులకు ఎదుర్కుని అంతటి వాడు అయ్యారు. ఎదిగిన తర్వాత పడి మళ్లీ కెరటం లా లేచిన ఓ సక్సెస్ ఫుల్ పర్సన్ ఆయన. పడిన ఆ కెరటం మళ్లీ లేవాలంటే తరంగాలు ఉద్భవించాలిగా! అందుకే  పూరి ఇప్పుడు గోవాలా సీరియస్ గా కథ రాసే పనిలో పడ్డట్లు సమాచారం. ప్రస్తుNతం ఆయన గోవా బీచ్ లో సీరియస్ గా ఓ స్టార్ హీరోకి కథ రాస్తున్నారుట.

కథ  పూర్తిచేసే వరకూ బీచ్ నుంచి కదిలేదే లేదని కసిగా పనిచేస్తున్నట్టు తెలుస్తోంది. మరి బ్యాంకాక్ వదిలేసి గోవాకి ఎందుకెళ్లినట్లు? అన్నదే ఇక్కడ ఆసక్తికరం. అవును పూరి కథలు రాయడానికి ఎక్కువగా బ్యాంకాక్ వెళ్తుంటాడు. అక్కడ బీచ్ లో కూర్చున్నాడటే వారం రోజుల్లో స్టోరీ రెడీ అయిపోతుంది. పూరికి-బ్యాంకాక్ బీచ్ కి అలా సెట్ అయింది. బ్యాంకాకు కుదరకపోతే రేర్ గా గోవాలోనూ సిట్టింగ్ వేస్తుంటారు.

ప్రస్తుతం పూరి గోవాలోనే ఉన్నట్ల్తు తెలుస్తోంది. మరి అలా దేనికి అన్నది ఆయన వ్యక్తిగతం ఏదైనా బీచ్ కాబట్టి పూరి ఆలోచనలకి ఆ కెరటాల శబ్ధం తోడైతే చాలు కథ రెడీ అయిపోతుంది. మరి ఈ కథ ఏ హీరోకి అన్నది క్లారిటీ లేదు.

పూరి తనయుడు ఆకాష్ తో సినిమా చేస్తాడని ఓవైపు ప్రచారంసాగుతుంది గానీ అందులో వాస్తవం కనిపించలేదు. ఆయన ప్లాప్ ల్లో ఉన్నాడు. అలాంటప్పడు  కుర్ర హీరోతో సినిమా ఎందుకు చేసత్ఆడని  మెజార్టీ వర్గం భావిస్తోంది.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.