వారసుడితో పూరి ప్లానింగ్ అలా ఉంది!

Tue Aug 16 2022 19:00:01 GMT+0530 (IST)

Puri is Committed To Great Comeback With Aakash Puri

టాలీవుడ్ ట్యాలెంటెడ్ హీరో విజయ్ దేవరకొండను బాలీవుడ్ కి పరిచయం చేస్తూ పూరి `లైగర్` మూవీని తెరకెక్కించిన సంగతి తెలిసిందే. ఈ సినిమాతో వీడీ పాన్ ఇండియా హీరోగా తనని తాను ఆవిష్కరించుకోబోతున్నాడు.లైగర్ లాంటి మాస్ యాక్షన్ సినిమాని తీసిన పూరీపై కరణ్ జోహార్ ప్రశంసల వర్షం కురిపిస్తూ సుదీర్ఘ నోట్ ని రాసిన సంగతి తెలిసిందే. దీంతో లైగర్ విడుదల గురించి అటు బాలీవుడ్ వర్గాలు ఎంతో ఆసక్తిగా వేచి చూస్తున్నాయి.

ఈ సినిమా రిలీజయ్యాక పూరీ ప్లానింగ్ ఎలా ఉంది? అంటే తాజా సమాచారం మేరకు విజయ్ దేవరకొండతో తదుపరి జేజీఎం చిత్రాన్ని తెరకెక్కించక ముందే అతడు తనయుడు ఆకాష్ పూరీతో సినిమా చేయాలనుకుంటున్నారని గుసగుసలు వినిపిస్తున్నాయి. ఆకాష్ పూరీతో పరిమిత బడ్జెట్లో తక్కువ సమయంలో పూర్తయ్యే సినిమాని చేసేందుకు పూరీ ప్రణాళికను సిద్ధం చేస్తున్నారనేది టాక్.

ఇక లైగర్ రిలీజ్ తర్వాత విజయ్ తన తదుపరి చిత్రం ఖుషీపై దృష్టి సారిస్తాడు. ఆ తర్వాత పూరీతో జనగనమణ చిత్రాన్ని పూర్తి చేస్తాడు. మెహబూబా - రొమాంటిక్ లాంటి చిత్రాలతో నటుడిగా నిరూపించుకున్న ఆకాష్ పూరీ కెరీర్ లో ఆశించిన బ్లాక్ బస్టర్ అందుకోవడంలో తడబడ్డాడు.

కానీ ఈసారి పూరి డైరెక్షన్ తో గ్రేట్ కంబ్యాక్ కోసం పట్టుదలగా ఉన్నాడని కూడా టాక్ వినిపిస్తోంది. వారసుడికి సరైన హిట్టు అందించి స్ట్రీమ్ లైన్ చేయాలని పూరీ కూడా ఆలోచిస్తున్నారు.

అయితే ప్రతిదీ లైగర్ విజయంపై ఆధారపడి ఉంది. ఒకవేళ లైగర్ చిత్రం బ్లాక్ బస్టర్ విజయం సాధిస్తే వెంటనే వీడీతో గ్యాప్ లేకుండా సినిమా చేసేందుకు కూడా ఆస్కారం లేకపోలేదు. ఆ వేడిని కొనసాగిస్తూ మరో విజయం అందుకునేందుకు అతడు బిగ్ ప్లాన్స్ తో ముందుకు వెళతాడనడంలో సందేహం లేదు. ఆకాష్ పూరీ  తో పూరి మూవీకి సంబంధించిన సరైన సమాచారం అందాల్సి ఉంది.