హీరోయిన్ గా పూరి కూతురు ఎంట్రీ ఇవ్వనుందా ?

Sat Nov 27 2021 14:00:02 GMT+0530 (IST)

Puri's daughter make an entry as a heroine

టాలీవుడ్ స్టార్ డైరెక్టర్లలో పూరి జగన్నాథ్ ఒకరు. ఒక వర్గం ప్రేక్షకులను మాత్రమే దృష్టిలో పెట్టుకుని కథలను అల్లుకునే ప్రయత్నాలు పూరి ఎప్పుడూ చేయలేదు. యూత్ కి .. ఫ్యామిలీ ఆడియన్స్ కి .. మాస్ ఆడియన్స్ కి నచ్చే అంశాలు తన కథలో ఉండేలా ఆయన చూసుకుంటాడు. అందువల్లనే అన్నివర్గాల ప్రేక్షకులు పూరి సినిమాలకు వస్తారు. ఎవరికి నచ్చిన అంశాలను వారు ఎంజాయ్ చేస్తూ ఫైనల్ గా హిట్టుపట్టుకొచ్చి దోసిట్లో పెట్టేస్తారు. ప్రస్తుతం ఆయన విజయ్ దేవరకొండ హీరోగా 'లైగర్' సినిమాను చేస్తున్నాడు.పూరి జగన్నాథ్ తన తనయుడు ఆకాశ్ ను హీరోగా చేశాడు. ఆరంభంలో కుర్రాడు కాస్త తడబడినా 'రొమాంటిక్' సినిమాతో దార్లో పడిపోయాడు. ఆ తరువాత సినిమాలకి సంబంధించిన పనులతో ప్రస్తుతం బిజీగానే ఉన్నాడు. ఇక పూరి కూతురు పవిత్ర విషయానికి వస్తే 'బుజ్జిగాడు' సినిమాలో చైల్డ్ ఆర్టిస్ట్ గా చేసింది. ఆ తరువాత తెరపై కనిపించలేదు. కానీ పవిత్ర  హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చే అవకాశం ఉందంటూ ఒక వార్త షికారు చేస్తోంది. సోషల్ మీడియాలో ఆమె పోస్ట్ చేస్తున్న ఫొటోలు ఆ సంకేతాలను ఇస్తున్నాయని చెప్పుకుంటున్నారు.

పూరి కూతురు పవిత్ర .. ఇప్పటి హీరోయిన్లకు ఎంతమాత్రం తీసిపోదు. విశాలమైన కళ్లతో ఆమె చాలా ఆకర్షణీయంగా కనిస్తుంది. అందువలన హీరోయిన్ గా తెరపై కనిపించాలనే ఆసక్తి ఆమెకి కలిగి ఉండొచ్చని అనుకుంటున్నారు. అయితే మొదటి నుంచి కూడా తన సిస్టర్ కి నటన పట్ల ఆసక్తి లేదనీ 'బుజ్జిగాడు' సినిమాలో కూడా నాన్న బాగా బ్రతిమాలితే ఒప్పుకుందని ఇటీవల ఒక ఇంటర్వ్యూలో ఆకాశ్ చెప్పాడు. ఆమెకి నిర్మాణ పరమైన విషయాలను చూసుకోవడం చాలా ఇష్టమనే విషయం కూడా చెప్పాడు.

తన పిల్లల ఇష్టానికి తాను ఎప్పుడూ అభ్యంతరం చెప్పనని ఆ మధ్య పూరి కూడా ఒక ఇంటర్వ్యూలో అన్నాడు. హీరోయిన్ గా ఎంట్రీ ఇవ్వాలనుకుంటే పవిత్రకి అది పెద్ద విషయమే కాదు. అందుకు అవసరమైన అన్ని వనరులు ఆమెకి అందుబాటులోనే ఉన్నాయి. కానీ ఎప్పుడూ కూడా ఆమె అలాంటి ఆలోచనను .. భావాలను వ్యక్తం చేయలేదు. అందువలన హీరోయిన్ గా ఆమె కెమెరా ముందుకు రాకపోవచ్చు. ఆకాశ్ చెప్పినట్టుగా సొంత బ్యానర్లో నిర్మాణ పరమైన విషయాలను చూసుకునే అవకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి.