Begin typing your search above and press return to search.

ఒక‌సారి పెళ్లికి క‌మిటైతే న‌దిలోకి దూకిన‌ట్టే!- పూరి

By:  Tupaki Desk   |   7 May 2021 3:35 PM GMT
ఒక‌సారి పెళ్లికి క‌మిటైతే న‌దిలోకి దూకిన‌ట్టే!- పూరి
X
పూరీ మ్యూజింగ్స్ కి ఉన్న పాపులారిటీ తెలిసిందే. 2020 లాక్ డౌన్ లో పూరి మ్యూజింగ్స్ ఎంద‌రికో స్ఫూర్తి నిచ్చాయి. ర‌క‌ర‌కాల స‌బ్జెక్టుల్ని ఎంచుకుని పూరి చెప్పిన చాలా సంగ‌తులు య‌వ‌త‌రానికి ఫుల్ గా న‌చ్చేవాయి. ఇప్పుడు మినిమ‌లిజం అనే దాని గురించి చెబుతూ పెళ్లి గురించి పూరి చేసిన కామెంట్ వేడెక్కించింది.

ఒక‌సారి పెళ్లికి క‌మిటైపోతే ఇక న‌దిలో దూకిన‌ట్టేన‌ని వ్యాఖ్యానించారు.
కొంద‌రి వ‌ద్ద అనవసరమైన వాటి గురించి ఒక లిస్ట్‌ ఉంటుంది. అందులో పెళ్లి కూడా ఉంటుంది. పెళ్లి.. ఈ ఒక్కటి కమిట్‌ అయితే మినిమలిజం లేదు. గాడిదగుడ్డూ లేదు. నదిలోకి దూకేసినట్టే. కొట్టుకుపోతూ ఉంటాం. ఎక్కడ ఆగుతామో ఎవ్వరికీ తెలీదు. అలా నది లోకి దూకరు కాబట్టే మినిమలిస్టులు చాలా హ్యాపీగా ఉంటారు. వాళ్లు బంధాలకు ఎక్కువ విలువ ఇవ్వరు. కానీ అనుబంధాలకు ప్రాధాన్యం ఇస్తారు.. అని పూరి వ్యాఖ్యానించారు. మినిమ‌లిస్టులు ఇత‌రుల భారం నెత్తికెత్తుకోరు అని కూడా చెప్పారు.

మినిమ‌లిస్టులు ఎప్పుడూ ఆరోగ్యంగా ఉంటారు. లైఫ్ లో ఎంత సక్సెస్ అయినా అందరూ అలవాటు చేసుకోవాల్సింది మినిమలిజం. అది ఇప్పటి నుంచే అలవాటు చేసుకుంటే మంచిదని అన్నారు. గొప్పలకు పోయి జీవితంలో ఎంత విజయం సాధించినా చివరికి ప్రతి ఒక్కరూ నేర్చుకోవాల్సింది మినిమలిజం. కావాల్సిన దాన్ని మాత్రమే వాళ్లు తమ దగ్గర ఉంచుకుంటారు. వాళ్లింట్లో కూడా కావాల్సిన వస్తువులు మాత్రమే ఉంటాయి. బీరువాలో కేవలం ఏడు జతల దుస్తులు మాత్రమే ఉంటాయి. కానీ మన ఇళ్లలో బీరువా తెరవగానే గుట్టలు గుట్టలుగా దుస్తులు వచ్చి మన కాళ్లపై పడిపోతాయి. సింపుల్ గా బతకడం మనకి రాదు. మినిమలిస్ట్‌ దగ్గర ఒక ఫోన్‌ ఉంటే అది పనిచేసినంత కాలం దాన్నే వాడతాడు. అంతేకానీ మార్కెట్ లోకి వచ్చిన ప్రతిదీ కొనేయ‌రు అని తెలిపారు.