స్టార్ హీరోల కంటే ముందు ఇస్మార్ట్ హీరోతోనే మళ్లీ పూరి

Sun Oct 25 2020 19:30:40 GMT+0530 (IST)

Puri again with the Ismart? hero

రామ్ హీరోగా పూరి దర్శకత్వంలో వచ్చిన ఇస్మార్ట్ మూవీ మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. ఆ ఒక్క సినిమా సక్సెస్ ఒక వైపు రామ్ ను బిజీ చేసింది మరో వైపు పూరి కెరీర్ ను మళ్లీ పుంజుకునేలా చేసింది. డాషింగ్ డైరెక్టర్ గా పేరున్న పూరి జగన్నాధ్ ప్రస్తుతం విజయ్ దేవరకొండతో సినిమాను చేస్తున్నాడు. ఆ సినిమాకు సంబంధించిన చిత్రీకరణ ఇప్పటికే పూర్తి అవ్వాల్సి ఉన్నా కూడా కరోనా కారణంగా ఆలస్యం అయ్యింది. వచ్చే నెల నుండి సినిమాను పునః ప్రారంభించేందుకు గాను ఏర్పాట్లు జరుగుతున్నాయి.విజయ్ దేవరకొండతో సినిమా చేస్తున్న పూరికి ఆ తర్వాత పెద్ద స్టార్స్ నుండి పిలుపు వస్తుందని అంతా ఆశిస్తున్నారు. కాని పూరి మాత్రం విజయ్ తో సినిమా తర్వాత ఇస్మార్ట్ హీరోతోనే మళ్లీ సినిమా చేయాలనే నిర్ణయానికి వచ్చినట్లుగా తెలుస్తోంది. ప్రస్తుతం రెడ్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రామ్ రెడీగా ఉన్నాడు.

ఇద్దరు కూడా ప్రస్తుతం వారు చేస్తున్న సినిమాలతో బిజీగా ఉన్నారు. వారి సినిమాలు పూర్తి అయిన తర్వాత మరో ఇస్మార్ట్ శంకర్ ప్రారంభం అయ్యే అవకాశం ఉంది. ఇస్మార్ట్ శంకర్ కు సీక్వెల్ చేస్తామంటూ దర్శకుడు పూరి హామీ ఇచ్చాడు. మరి పూరి.. రామ్ ల కాంబోలో రాబోతున్నది సీక్వెల్ అయ్యి ఉంటుందా లేదంటే కొత్త సబ్జెక్ట్ అయ్యి ఉంటుందా అనేది తెలియాలంటే కాస్త సమయం పట్టే అవకాశం ఉంది.