Begin typing your search above and press return to search.

డాషింగ్ డైరెక్టర్ నోట 'రాజముడి' రైస్ ప్రత్యేకతలు!

By:  Tupaki Desk   |   11 May 2021 3:16 PM GMT
డాషింగ్ డైరెక్టర్ నోట రాజముడి రైస్ ప్రత్యేకతలు!
X
టాలీవుడ్ డాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ గురించి సినిమా ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఆయన ఎలాంటి మాస్ డైరెక్టర్ అనేది అందరికి తెలుసు. కెరీర్ పరంగా ఎన్నో సూపర్ హిట్స్ అందుకున్న పూరీ.. కొన్నేళ్లుగా ఓ సాలిడ్ హిట్ కోసం ట్రై చేస్తున్నాడు. అయితే చివరిగా ఇస్మార్ట్ శంకర్ అనే సినిమా తీసాడు. ఆ సినిమా బాక్సాఫీస్ వద్ద హిట్ అయింది కానీ అందరికి రీచ్ కాలేదని టాక్. అయితే ప్రస్తుతం తెలుగు మాత్రమే కాదని పాన్ ఇండియా సినిమా రూపొందిస్తున్నాడు. యంగ్ సెన్సేషన్ విజయ్ దేవరకొండ హీరోగా బాక్సింగ్ నేపథ్యంలో లైగర్ అనే సినిమా చేస్తున్నాడు పూరీ. ఈ సినిమా దేశవ్యాప్తంగా ఐదు భాషల్లో విడుదల కాబోతుంది.

ఇదిలా ఉండగా.. పూరీ సినిమాలు - కథలు - డాషింగ్ డైలాగ్స్ తో పాటుగా సోషల్ మీడియాలో మ్యూజింగ్స్ రూపంలో ఆయన ఎన్నో ఇంపార్టెంట్ విషయాలను అభిమానులకు తెలియజేస్తున్నారు. ఏ ఉద్దేశంతో చెబుతున్నాడో కానీ ఫ్యాన్స్ మాత్రం ఫుల్లుగా ఖుషీ అయిపోతున్నారు. మరి అంతలా ఇన్ఫర్మేషన్ ఏం ఇస్తున్నాడు అంటే.. తాజాగా చెప్పిన రాజముడి రైస్ గురించి చెప్పిన విషయం వినాల్సిందే. తాజాగా పూరీ 'రాజముడి రైస్' ప్రత్యేకతలు - ఉపయోగాలు క్లియర్ గా చెప్పుకొచ్చాడు.

పూరీ మాట్లాడుతూ.. 'ఇండియాలో రైస్ చాలా ముఖ్యమైన ఆహరం. వీటిలో బాస్మతి, అన్నపూర్ణ, చంప, హన్సరాజ్, మొలకొలుకులు, పూస, సోనామసూరి, జాస్మిన్, సురేఖ.. ఇలా కొన్ని మాత్రమే మనకు తెలుసు. ఒకప్పుడు ఇండియాలో ఒక లక్ష వెరైటీ రైస్ ఉండేవి. ఒక రకం రైస్ పండించే రైతు చనిపోతే అది ప్రపంచంలో నుంచి మాయమైపోతుంది. ఎందుకంటే ఆ రైతు పిల్లలు దాన్ని పండించరు. వాళ్లు కూడా మర్చిపోతే అంతే. అలా ఎన్నో రకాల వెరైటీస్ మాయమైపోయాయి. ఆ తర్వాత నలభైవేల రకాల రైస్ మిగిలాయి. గత 50 సంవత్సరాలలో అవి కూడా కనుమరుగైపోయాయి.

ఇప్పుడు ఆరు వేల రకాల రైస్ మాత్రమే ఉన్నాయి. అందులో 'రాజముడి' రైస్ అనే రకం గురించి మీకు చెప్పాలి. కర్ణాటకలో పూర్వం పన్ను కట్టడానికి డబ్బులు లేకపోతే ఈ రాజముడి రైస్ పన్నుగా కట్టేవారు. ఆ రైస్ కి అంత వాల్యూ ఉండేది. నాకు విజయ్ రామ్, రామ్ బాబు అనే ఇద్దరు ఈ రైస్ గురించి చెప్పారు. ఇందులో యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉంటాయి. ఇమ్యూనిటీ కూడా పెరుగుతుంది. డయాబెటిక్ పేషంట్స్, ఆడవాళ్లు ఖచ్చితంగా తినాల్సిన రైస్ ఇది" ఇంకా ఇంపార్టెంట్ విషయాలు తెలిపాడు పూరీ. ప్రస్తుతం పూరీ చెప్పిన రాజముడి రైస్ టాపిక్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.