Begin typing your search above and press return to search.

మనలో ఏ ఒక్కరికి బుద్ధిలేదు.. అందుకే బుద్ధుడి గుడికెళ్లి అలా ప్రవర్తిస్తున్నాం..!

By:  Tupaki Desk   |   19 Oct 2020 5:00 PM GMT
మనలో ఏ ఒక్కరికి బుద్ధిలేదు.. అందుకే బుద్ధుడి గుడికెళ్లి అలా ప్రవర్తిస్తున్నాం..!
X
డైరెక్టర్​ పూరి జగన్నాథ్​ ఇటీవల మ్యూజింగ్స్​ పేరుతో యూట్యూబ్​లో రకరకాల అంశాలపై వీడియోలు పెడుతున్న విషయం తెలిసిందే. పూరి థాట్స్​ యూత్​కు బాగా కనెక్ట్​ అవుతున్నాయి. పూరి వీడియోల కోసం ఆసక్తిగా ఎదురుచూసే వాళ్లు కూడా ఉన్నారు. ప్రతిరోజూ వివిధ అంశాలపై తన అభిప్రాయాలను పంచుకుంటున్నారు పూరి. చాలా వీడియోలు యువతలో స్ఫూర్తి పెంచేలే ఉంటున్నాయి. అయితే తాజాగా పూరి విడుదల చేసిన ఓ వీడియో మాత్రం నెట్టింట్లో తెగ వైరల్​ అవుతున్నది.

‘దుఃఖానికి మూలం కోరికలు.. కాబట్టి కోరికలను జయిస్తే మనకు దుఃఖం కలగదు’ అంటూ గౌతమ బుద్ధుడు బోధించాడు. కానీ ప్రస్తుతం బుద్ధుడి భక్తులు మాత్రం ఆయన ఆశయాలను నాశనం చేస్తున్నారు. మా కోరికలు, మొక్కుల తీర్చు దేవుడా..! అంటూ బుద్దిడి వెంట పరుగెడుతున్నారు’ అంటూ మ్యూజింగ్స్​లో హితబోధ చేశాడు పూరి.. ఇంతకీ పూరి ఏమన్నాడంటే.. ‘హిమాలయాల దగ్గర హిమాచల్‌ప్రదేశ్​ రాష్ట్రంలో స్పితి అనే చిన్న ఊరుంది. అక్కడ వెయ్యి సంవత్సరాల ముందు కట్టిన ఓ బుద్ధుని గుడి ఉంది. చాలా మంది భక్తులు బుద్దుడిని దర్శనం చేసుకోవడానికి అక్కడికి వెళ్తుంటారు. రాతిపలక మీద ఉలితో పేరును చెక్కించుకుంటే కోరికలు నెరవేరతాయని భక్తుల నమ్మకం.

దీంతో అక్కడికి వెళ్లే యాత్రికులంతా తమ పేర్లను రాతి పలకలమీద చెక్కించుకుంటున్నారు. ఈ పని చేయడానికి అక్కడ శిల్పులు సిద్ధంగా ఉంటారు. అలా ఆ గుడి మొత్తం రాతి పలకలతో నిండిపోయింది. నిజానికి ఇదో పిచ్చి పనికిమాలిన పని. బుద్దుడు చెప్పిందేమిటి.. మనం చేస్తున్నదేమిటి.. కోరికలు జయించాలని బుద్దుడు చెబితే . మనం మాత్రం కోరికల లిస్ట్​ తీసుకెళ్లి బుద్దుడికి ఇస్తున్నాం. దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. మనం ఎంత బుర్ర తక్కువ వెధవలమో. నాకు ఇంకో విషయం కూడా అర్థం కాదు. స్పితి దగ్గర ఎంతో మంది బౌద్ధ సన్యాసులు ఉంటారు. కనీసం వాళ్లయినా ఈ భక్తులకు అర్థం అయ్యేలా చెప్పారా’ అంటూ పూరి మ్యూజింగ్స్​లో చెప్పాడు.