చిరంజీవా.. ఆమెతో నన్ను కొట్టించావయ్యా: పూరి

Wed Apr 01 2020 16:40:01 GMT+0530 (IST)

Puri Jagannath Wife Slapped Him With Chiranjeevi Tweet

చిరంజీవి చేసిన ఒక్క ట్వీట్ పూరి జగన్నాథ్ కాపురంలో చిచ్చు పెట్టిందట.. స్వయంగా ఈ మాట పూరినే తాజాగా వెల్లడించాడు. చిరంజీవి ట్వీట్ తో నా భార్య.. నా చెంప పగుల కొట్టిందని పూరి జగన్నాథ్ సంచలన విషయం వెల్లడించారు. ఇంతకీ పూరి చెంప ఎందుకు పగిలింది.చిరంజీవి ట్వీట్ లో ఏముంది? పూరి భార్య ఎందుకిలా చేసిందో తెలుసుకుందాం..పూరి జగన్నాథ్ ఏదైనా సినిమా మొదలు పెట్టడానికి ముందు బ్యాంకాక్ వెళ్లడం ఆయనకు సెంటిమెంట్ గా వస్తోంది.. అక్కడే స్క్రిప్ట్ రాసుకొని వచ్చి సినిమాను పూర్తి చేసేవారు. కానీ అక్కడ రాసిన కథలన్నీ వరుసగా ఫ్లాప్ కావడంతో ఇక దేశంలోనే సినిమా కథలు సిద్ధం చేయడం మొదలుపెడుతున్నారు. ఈ మధ్య గోవాలో రాస్తున్నారని తెలిసింది.

ఇటీవలే పూరి జగన్నాథ్ బ్యాంకాక్ సీక్రెట్ ను చిరంజీవి బయటపెట్టారు. చిరంజీవి ఈ మధ్యనే ట్విట్టర్ - ఇన్ స్టాగ్రామ్ లోకి ఎంట్రీ ఇచ్చాడు. అన్నయ్య రాకను పురస్కరించుకొని పూరి జగన్నాథ్ గ్రాండ్ వెల్ కమ్ చెప్పాడు. ఈ మేరకు ట్వీట్ చేశాడు పూరి.

పూరీ ట్వీట్ కు చిరంజీవి సరదాగా స్పందించాడు. 'కరోనా కారణంగా నువ్వు బ్యాంకాక్ మిస్ అవుతున్నావ్ కదా.. నువ్విలా ఇంట్లోనే గడపడం ద్వారా పవిత్ర - ఆకాశ్ చాలా సంతోష పడుతున్నారు' అంటూ చిరంజీవి కామెంట్ చేశారు.

ఇప్పుడు ఇదే ట్వీట్ తన కొంప ముంచిందని పూరి జగన్నాథ్ తాజాగా అంటున్నారు.ఈ చిరు ట్వీట్ చూసి పాత జ్ఞాపకాలు నెమరువేసుకొని నా భార్య చెంప పగులకొట్టిందని పూరి చెప్పుకొచ్చాడు. ఇలా చిరు చేసిన ట్వీట్ తో పూరి - ఆయన భార్య మధ్య చిన్నపాటి గొడవనే సృష్టించిందన్నమాట..

ప్రస్తుతం విజయ్ దేవరకొండతో 'ఫైటర్' తీస్తున్న పూరి జగన్నాథ్... కరోనా కారణంగా షూటింగ్ వాయిదా వేసి సుబ్బరంగా ఇంట్లోనే కాలం గడుపుతున్నాడు. కరోనా జాగ్రత్తలపై వీడియోలు తీస్తూ అవగాహన కల్పిస్తున్నారు.