Begin typing your search above and press return to search.

టీజర్ చూడగానే చరణే గుర్తొచ్చాడు

By:  Tupaki Desk   |   23 Sep 2019 4:28 AM GMT
టీజర్ చూడగానే చరణే గుర్తొచ్చాడు
X
నిన్న మెగా స్టార్ నటించిన 'సైరా నర్సింహ రెడ్డి' హైదరాబాద్ లోని ఎల్ .బి. స్టేడియంలో అంగరంగవైభవంగా జరిగింది. పవన్ కళ్యాణ్ - రాజమౌళి - కొరటాల మరికొందరు ముఖ్య అతిథులుగా హాజరై వేడుకకు కల తీసుకొచ్చారు. ఇక ఈ ఈవెంట్ కి రాలేక పోయిన పూరి జగన్నాథ్ లేటెస్ట్ గా ఈ సినిమా గురించి ఓ వీడియో బైట్ వదిలాడు.

కొన్నేళ్ల క్రితం చిరంజీవి గారితో అందరం గర్వించే సినిమా చేయాలని ఉందని చరణ్ చెప్పాడని, ఇప్పుడు 'సైరా' తీసాడని అన్నాడు. ఇక టీజర్ చూడగానే చరణ్ అప్పుడు అన్నమాటలే గుర్తొచ్చాయని - సురేందర్ రెడ్డి చితక్కొట్టేసాడని ప్రశంసలు కురిపించారు. ఇక ఫైనల్ గా అన్నయ్య గురించి ఏం చెప్పాలి. హీరోగా ఆయనని కొట్టేవాడు ఇంకా పుట్టలేదు. లవ్ యూ అన్నయ్య మెగా అభిమానిగా 'సైరా' పెద్ద హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అంటూ ముగించాడు.

రామ్ చరణ్ ని 'చిరుత' తో హీరోగా పరిచయం చేసిన పూరి మెగా స్టార్ తో కూడా సినిమా చేయాలని చూసాడు. 'ఆటో జానీ' అనే కథ సిద్ధం చేసి ఆ మధ్య చిరుకి వినిపించిన సంగతి కూడా తెలిసిందే. కట్ చేస్తే మెగా స్టార్ పూరికి నో చెప్పాడు. ఆ సందర్భంలో పూరి కొంచెం హార్ట్ అయ్యాడు. ఇక అవన్నీ పట్టించుకోకుండా ఇప్పుడు మెగా అభిమానిగా సైరా అంటున్న మెగా స్టార్ కి నిర్మాత చరణ్ కి శుభాకాంక్షలు తెలుపుతూ సినిమా పెద్ద విజయం సాధించాలని కోరుకున్నాడు.